For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: పీవీ సింధుకు కఠిన పరీక్ష! ఒలింపిక్స్‌‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే!

What To Watch Today July 31 Tokyo Olympics Indian Schedule And Events

హైదరాబాద్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం భారత్‌కు కలిసొచ్చింది. బాక్సర్ లవ్లీనా సెమీస్‌కు దూసుకెళ్లి మరో మెడల్ ఖాయం చేయగా.. గోల్డ్ మెడల్ టార్గెట్‌గా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత పురుషుల హాకీ టీమ్ సైతం తమ జైత్రయాత్రను కొనసాగించగా మహిళల హాకీ టీమ్ తొలి విజయాన్నందుకొని క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే శనివారం కూడా భారత్ అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా సింధు అగ్నీ పరీక్ష ఎదుర్కొనుంది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ తై జూ యింగ్(చైనీస్ తైపీ)తో తలపడనుంది. బాక్సర్ అమిత్ పంగల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

ఒలింపిక్స్‌లో రేపటి(జూలై 30) భారత షెడ్యూల్

1. బ్యాడ్మింటన్

మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ (పీవీ సింధు vs తై జూ యింగ్(చైనీస్ తైపీ) మధ్యాహ్నం 3.20 గంటలకు

2.షూటింగ్
మహిళల 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్స్ క్వాలిఫికేషన్ (తేజశ్విని, అంజుమ్ మౌద్గిల్)- ఉదయం 8.30 గంటలకు

మహిళల 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్స్ ఫైనల్ (క్వాలిఫై అయితే)- మధ్యాహ్నం 12.30 గంటకు

3.అథ్లెటిక్స్

మహిళల డిస్కస్ త్రో క్వాలిఫికేషన్- గ్రూప్ ఏ(సీమా పునియా)- ఉదయం 6 గంటలకు

మహిళల డిస్కస్ త్రో క్వాలిఫికేషన్- గ్రూప్ బి(కమల్ ప్రీత్ కౌర్)- ఉదయం 7.25 గంటలకు

పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్- గ్రూప్ బి (శ్రీ శంకర్)- మధ్యాహ్నం 3.40 గంటలకు

4. హాకీ

మహిళల పూల్ఏ- భారత్ vs సౌతాఫ్రికా- ఉదయం 8.45 గంటలకు

5. బాక్సింగ్
పురుషుల ఫ్లై వెయిట్(48-52 కేజీలు) రౌండ్ ఆఫ్ 16(అమిత్ పంగల్ కౌర్ vs యుబెర్జెన్(కొలంబియా)-ఉదయం 7.30 గంటలకు

మహిళల మిడిల్ వెయిట్(69-75 కేజీ) క్వార్టర్ ఫైనల్ 4 (పూజా రాణి vsకియాల్ లి (చైనా)) మధ్యాహ్నం 3.36 గంటలకు

6. సెయిలింగ్

పురుషుల స్కిఫ్-49ఈఆర్ రేస్-10(గణపతి కెలపండా-వరుణ్ తక్కర్)

7. గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2(అనిర్బన్ లాహిరి) ఉదయం 4.15 గంటలకు

పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 3(అనిర్బన్ లాహిరి, ఉదయన్ మానే)- ఉదయం 6 గంటలకు

Story first published: Friday, July 30, 2021, 21:40 [IST]
Other articles published on Jul 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+