For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: పీవీ సింధుకు పెద్దగండం! ఒలింపిక్స్‌‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే!

What To Watch Today July 30 Tokyo Olympics Indian Schedule And Events

హైదరాబాద్: ఒలింపిక్స్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఉత్త చేతులతో వెనుదిరుగుతున్నారు. తొలి రోజే మీరాబాయి చాను సిల్వర్‌తో మెరవడం తప్ప తర్వాతి ఐదు రోజులూ భారత్‌కు నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అయితే ఆరో రోజైన బుధవారం పతకం రాకపోయినా ఆశజనక ఫలితాలు వచ్చాయి. గోల్డ్ మెడల్ టార్గెట్‌గా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు..క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా.. భారత పురుషుల హాకీ టీమ్ సైతం క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. బాక్సర్ సతీశ్ కుమార్ సూపర్ పంచ్‌తో అదరగొట్టాడు. ఆర్చరీలో అతాను దాస్ ప్రిక్వార్టర్స్ చేరి ఆశలు రేపాడు. షూటింగ్‌లో మనుభాకర్ అదరగొట్టగా.. రోయింగ్, సెయిలింగ్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ ముందుంజ వేయలేకపోయారు. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన పోరాటాన్ని ప్రీక్వార్టర్స్‌లోనే ముగించి అభిమానుల గుండెలను బద్దలు చేసింది.

ఇక శుక్రవారం కూడా భారత్‌కు కీలక ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో మెడల్ ఖాయమయ్యే పోటీలు ఉన్నాయి. క్వార్టర్స్‌కు చేరిన పీవీ సింధుకు యమగూచి రూపంలో పెద్దగండం పొంచి ఉంది. బాక్సర్ లవ్లీనా క్వార్టర్స్‌లో తలపడనుంది. అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి.

ఒలింపిక్స్‌లో రేపటి(జూలై 30) భారత షెడ్యూల్

1. బ్యాడ్మింటన్

ఉదయం 1.05: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ (పీవీ సింధు vs అకానే యమగూచి(జపాన్)) మధ్యాహ్నం 1.15 గంటలకు

2.షూటింగ్
మహిళల 25 మీటర్ల పిస్టోల్ క్వాలిఫికేషన్ ర్యాపిడ్ (రహి సర్నోబట్, మనుభాకర్)- ఉదయం 5.30 గంటలకు

మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఫైనల్(క్వాలిఫై అయితే)- 10.30 గంటలకు

3.అథ్లెటిక్స్
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ రౌండ్ 1- హీట్ 2(అవినాశ్ ముకంద్ సేబుల్) - ఉదయం 6.17 గంటలకు

పురుషఉల 400 మీటర్ల హర్డల్స్ రౌండ్ 1- హీట్ 5(ఎంపీ జబీర్)- ఉదయం 8.27 గంటలకు

మహిళల 100 మీటర్ల రౌండ్1- హీట్ 1(ద్యుతీ చంద్)- ఉదయం 8.45 గంటలకు

4X400 మీటర్ల రీలే మిక్స్‌డ్ రౌండ్ 1- హీట్ 2(రేవతి వీరమణి-సుభా వెంకటేషన్, అలెక్స్ ఆంటోని, సర్తక్ బాంబ్రీ)

4. హాకీ

మహిళల పూల్ఏ- భారత్ vs ఐర్లాండ్

5. బాక్సింగ్
మహిళల లైట్ వెయిట్(57-60 కేజీలు) రౌండ్ ఆఫ్ 16(సిమ్రన్ జిత్ కౌర్ vs సుదాపోర్న్(థాయిలాండ్))

మహిళల వెల్టర్ వెయిట్(64-69 కేజీ) క్వార్టర్ ఫైనల్ 2(లవ్లీనా బోర్‌గోహైన్ vs నీన్-చిన్ చెన్ ఆఫ్ చైనీస్ తైపీ) ఉదయం 8.48 గంటలకు

6. సెయిలింగ్

మహిళల ఒన్ పర్సన్ డింగీ-లేజర్ రేడియల్- రేస్09(నేత్ర కుమనన్)

పురుషుల స్కిఫ్- రేస్-7(గణపతి కెలపండా-వరుణ్ తక్కర్)

పురుషుల ఒన్ పర్సన్ డింగీ-లేజర్ రేస్9(విష్ణు శ్రవణన్) ఉదయం 11.05 గంటలకు

7. గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2(అనిర్బన్ లాహిరి)

పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2(ఉదయన్ మానే)-11.09 గంటలకు

Story first published: Thursday, July 29, 2021, 22:15 [IST]
Other articles published on Jul 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+