Tokyo 2020: ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే! బరిలో సింధు, మేరీకోమ్!

హైదరాబాద్: ఒలింపిక్స్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఉత్త చేతులతో వెనుదిరుగుతున్నారు. తొలి రోజే మీరాబాయి చాను సిల్వర్‌తో మెరవడం తప్ప తర్వాతి నాలుగు రోజులూ భారత్‌కు నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అయితే ఐదో రోజైన బుధవారం పతకం రాకపోయినా ఆశజనక ఫలితాలు వచ్చాయి. భారత యువ బాక్సర్ పూజారాణి (75 కిలోలు) సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్ చేరిందంటే ఆమెకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి బౌన్స్ బ్యాక్ అయింది. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌కు చేరింది. ఇక గురువారం కూడా పలువు అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఒలింపిక్స్‌లో రేపటి(జూలై 29) భారత షెడ్యూల్
1. ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేటర్: అతాను దాస్- ఉదయం 7.31 గంటలకు(1/16 ఎలిమినేటర్-8.10 గంటలకు
2. బ్యాడ్మింటన్
మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16: పీవీ సింధు vs మియా బ్లిచ్‌ఫెల్ట్
3. బాక్సింగ్:
మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 16: మేరీ కోమ్ vs ఇంగ్రిట్ వాలెన్సియా- మధ్యాహ్నం 3.36 గంటలకు
పురుషుల సూపర్ హెవీ వెయిట్ రౌండ్ 16: సతీశ్ కుమార్ vs రికార్డో బ్రౌన్- ఉదయం 8.48 గంటలకు
4. గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత రౌండ్ 1- ఉదయ మనే- ఉదయం 11.09 గంటలకు
అనిల్‌బాన్ లాహిరి- ఉదయం 8.52 గంటలకు
5. హాకీ
పురుషుల పూల్ స్టేజ్: భారత్ vs అర్జెంటీనా- ఉదయం 6 గంటలకు
6. రోయింగ్
పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ: అర్జున్ లాల్ జాట్, అర్వింద్ సింగ్- ఉదయం 5.20 గంటలకు
7. సెయిలింగ్
పురుషుల స్కిఫ్ 49ఈఆర్- కేసీ గణపతి, వరుణ్ థక్కర్, రేస్6- ఉదయం 8.35 గంటలకు, రేస్ 7-
మహిళల డిగ్నీ- లేసర్ రేడియల్- నేత్ర కుమారణ్ రేస్7- ఉదయం 8.45 గంటలకు, రేస్ 8- ఉదయం 9.35 గంటలకు
8. షూటింగ్
మహిళల 25 మీటర్ల పిస్టోల్ క్వాలిఫికేషన్: మనుభాకర్, రాహి సార్నోబట్- ఉదయం 5.30 గంటలకు
9. స్విమ్మింగ్
100 మీటర్ల బటర్ ఫ్లై హీట్స్: హీట్ 2- సజన్ ప్రకాశ్- సాయంత్రం 4.16 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications