For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: ఒలింపిక్స్‌‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే! బరిలో తెలుగు తేజం సింధు!

What To Watch Today July 28 Tokyo Olympics Indian Schedule And Events

హైదరాబాద్: ఒలింపిక్స్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఉత్త చేతులతో వెనుదిరుగుతున్నారు. తొలి రోజే మీరాబాయి చాను సిల్వర్‌తో మెరవడం తప్ప తర్వాతి మూడు రోజులూ భారత్‌కు నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. నాలుగో రోజైన మంగళవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. మెన్స్ హాకీ టీమ్‌, బాక్సర్ లవ్లీనా విజయాలు తప్ప మిగతా అన్నింట్లోనూ మనవాళ్లు దారుణంగా విఫలమయ్యారు.

ఇక బుధవారం భారత ఆర్చర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పీవి సింధు బరిలోకి దిగనుంది. రెండో విజయంపై కన్నేసిన సింధు టోర్నీలో ముందడగువేయాలని భావిస్తుండగా.. పురుషుల సింగిల్స్ స్టార్ బీ సాయిప్రణీత్ తొలి మ్యాచ్ ఓటమి నుంచి తేరుకొని బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్దమవుతున్నాడు. బాక్సర్ పుజారాణి, సెయిలర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఒలింపిక్స్‌లో రేపటి(జూలై 28) భారత షెడ్యూల్
1.ఆర్చరీ

పురుషుల1/32 ఎలిమినేషన్ రౌండ్

తరుణ్‌దీప్ రాయ్ vs ఒలెక్సెయ్- ఉదయం 7.31 గంటలకు(క్వాలిఫై అయితే 1/16 ఎలిమినేషన్ రౌండ్ - ఉదయం 8.10 గంటలకు)

ప్రవీణ్ జాదవ్ vs గల్సాన్ బజర్జ్‌పోవ్-ఉదయం 12.30 గంటలకు(క్వాలిఫై అయితే 1/16 ఎలిమినేషన్ రౌండ్ -మధ్యాహ్నం 1.22 గంటలకు)

మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్

దీపికా కుమార్ vs కర్మ బు- మధ్యాహ్నం 2.14 గంటలకు(క్వాలిఫై అయితే 1/16 ఎలిమినేషన్ రౌండ్- మధ్యాహ్నం 2.43 గంటలకు)

2.బ్యాడ్మింటన్

మహిళల సింగిల్స్ గ్రూప్ ప్లే: పీవీ సింధు vs చుంగ్ గాన్ యి- ఉదయం 7.30 గంటలకు

పురుషుల సింగిల్స్ గ్రూప్ ప్లే: బీ సాయి ప్రణీత్ vs మార్క్ కల్జౌ- మధ్యాహ్నం 2.30 గంటలకు

3.బాక్సింగ్

మహిళల మిడిల్ వెయిట్ రౌండ్ 16: పూజా రాణి vs ఇచ్రక్ చైమ్- మధ్యాహ్నం 2.30 గంటలకు

4.హాకీ:

మహిళల పూల్ మ్యాచ్: భారత్ vs గ్రేట్ బ్రిటన్ ఉదయం 6.30 గంటలకు

5.రోయింగ్

పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్: అరుణ్ లాల్ జాట్- అర్వింద్ సింగ్- సెమీఫైనల్స్ ఏ/బి 2- ఉదయం 8 గంటలకు

6.సెయిలింగ్

కెలపండ గణపతి, వరుణ్ తక్కర్- పురుషుల స్కిఫ్ఫర్ 49ఈఆర్ ఓపెనింగ్ సిరీస్

రేస్ 02- ఉదయం 8.35 గంటలకు

రేస్ 03- ఉదయం 9.30 గంటలకు

రేస్ 04- ఉదయం 10.25 గంటలకు

Story first published: Tuesday, July 27, 2021, 23:11 [IST]
Other articles published on Jul 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+