
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ మూడో రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. ఒక్క పతకం కూడా రాలేదు. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ శుభారంభాలు అందుకున్నారు. ఇక షూటింగ్ ఈవెంట్‌లో నిరాశే ఎదురైంది. నాలుగో రోజు కూడా భారత అథ్లెట్లు పలు ఈవెంట్స్‌లో పోటీ పడనున్నారు. ముఖ్యంగా భారత పురుషుల ఆర్చరీ టీమ్ అతాను దాసు, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ సోమవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భారత మహిళల హాకీ టీమ్ జర్మనీతో తలపడనుంది. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మన కోనసీమ కుర్రాడి జోడీ బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్ పటిష్ట జోడీని మట్టికరిపించిన భారత జోడీ.. రెండో రౌండ్‌లో ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.
ఒలింపిక్స్ నాలుగో రోజు భారత షెడ్యూల్
ఆర్చరీ:
పురుషుల టీమ్ ఎలిమినేషన్(అతాను దాస్/ప్రవీణ్ జాదవ్/ తరుణ్ దీప్ రాయ్ vs కజకిస్తాన్ ఆర్చర్స్) ఉదయం 6 గంటలకు
షూటింగ్: స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్- డే2(మైరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్ విర్ సింగ్ బాజ్వా) ఉదయం 6.30 గంటలకు
పురుషుల స్కీట్ ఫైనల్-12.20 గంటలకు
టేబుల్ టెన్నిస్:
పురుషుల సింగిల్స్ రౌండ్ 2(శరత్ కమల్ vs టియాగో అపోలోనియా (పోర్చుగల్)) ఉదయం 6.30 గంటలకు
మహిళల సింగిల్స్ రౌండ్ 2( సుత్రితా ముఖర్జీ vs ఫు యు (పోర్చుగల్))
మహిళల సింగిల్స్ రౌండ్ 3( మానిక బాత్రా vs సోఫియా పోల్కోనొవ(ఆస్ట్రియా)) మధ్యాహ్నం 12 గంటలకు
సెయిలింగ్:
మహిళల ఒక వ్యక్తి డింగీ- లేజర్ రెడియల్-రేస్ 3(నేత్ర కుమనన్)
పురుషుల ఒక వ్యక్తి డింగీ-లేజర్-రేస్ 02(విష్ణు సర్వనన్)
బ్యాడ్మింటన్:
పురుషుల డబుల్స్ గ్రూప్ ప్లే స్టేజ్- (సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి/చిరాగ్ శెట్టి vs మార్కస్ ఫెర్నాల్డి/కెవిన్ (ఇండోనేషియా) -ఉదయం 9.10 గంటలకు
టెన్నిస్:
పురుషుల సింగిల్స్ రౌండ్(సుమిత్ నాగల్ vs డానియల్ మెద్వేదేవ్
స్విమ్మింగ్
పురుషుల 200 మీటర్ల బటర్ ఫ్లై-హీట్2(సంజన్ ప్రకాశ్)