For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: హాకీ అమ్మాయిలు, బాక్సర్ లవ్లీనాకు సెమీస్ గండం.. రేపటి భారత షెడ్యూల్ ఇదే!

What To Watch Today August 4 Tokyo Olympics Indian Schedule And Events

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్​లో మంగళవారం భారత్​కు ఏమాత్రం కలిసిరాలేదు. కనీసం ఒక్క విజయం కూడా దక్కలేదు. పాల్గొన్న అన్ని ఈవెంట్లలో ఓటమే ఎదురైంది. 49 ఏళ్ల తర్వాత సెమీఫైనల్ చేరి ఆశలు రేకెత్తించిన భారత పురుషుల హాకీ టీమ్.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత షాట్‌పుట్ అథ్లెట్ తజిందర్​ పాల్ సింగ్, జావెలిన్ త్రోయర్ అన్ను రాణి, రెజ్లర్ సోనమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ఇక బుధవారం యావత్ భారతం ఎదురుచూస్తున్న రసవత్తర ఈవెంట్స్ జరగనున్నాయి. మహిళల హాకీ టీమ్ సెమీఫైనల్లో తలపడుతుండగా.. బాక్సర్ లవ్లీనా తన స్వర్ణ పోరాటం కొనసాగించనుంది. భారత్‌కు కలిసొచ్చే రెజ్లింగ్ పోటీలు మొదలుకానున్నాయి.

ఒలింపిక్స్‌లో రేపటి(ఆగస్టు 4) భారత షెడ్యూల్

1.అథ్లెటిక్స్

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్- గ్రూప్ఏ(నీరజ్ చోప్రా)- ఉదయం 5.35 గంటలకు

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్- గ్రూప్ బీ (శివ్ పాల్ సింగ్)- ఉదయం 7.05 గంటలకు

2.బాక్సింగ్
మహిళల వెల్టర్ వెయిట్(64-69 కేజీ) సెమీ ఫైనల్ 1 (లవ్లీనా బొర్గోహైన్ vs బుసెనజ్ సుర్మెనెలి(టర్కీ)) ఉదయం 11 గంటలకు

3. హాకీ

మహిళల సెమీ ఫైనల్ - భారత్ vs అర్జెంటీనా- సాయంత్ర 3.30 గంటలకు

4. గోల్ఫ్

మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 1(అదితి అశోక్) ఉదయం 5.55 గంటలకు

మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 1(దీక్ష దగర్) ఉదయం 7.39 గంటలకు

6. రెజ్లింగ్

పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల 1/8 ఫైనల్(రవికుమార్) ఉదయం 8 గంటల నుంచి

మహిళల ఫ్రీ స్టైల్ 57 కేజీల 1/8 ఫైనల్(అన్షు మాలిక్) ఉదయం 8 గంటల నుంచి

పురుషుల ఫ్రీ స్టైల్ 86 కేజీలు 1/8 ఫైనల్(దీపక్ పూనియా) ఉదయం 8 గంటల నుంచి

Story first published: Tuesday, August 3, 2021, 21:53 [IST]
Other articles published on Aug 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+