
హైదరాబాద్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత మహిళల హాకీ టీమ్ మినహా అన్నీ ఈవెంట్లలో ప్రతికూలత ఫలితాలే వచ్చాయి. క్వార్టర్స్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత మహిళలు ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. ఆశలు రేకెత్తించిన కమల్ ప్రీత్, ఫవాద్ మీర్జా ఫైనల్లో నిరాశపరిచారు.
ఇక మంగళవారం కూడా భారత్ అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా భారత పురుషుల హాకీ టీమ్ కీలక సెమీఫైనల్లో తలపడనుంది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. 41ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్ సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఫైనల్‌కు చేరి రికార్డు సాధించినట్లవుతుంది. చివరిసారిగా 1980లో పురుషుల హాకీ జట్టు స్వర్ణం దక్కించుకుంది.
ఒలింపిక్స్‌లో రేపటి(ఆగస్టు 3) భారత షెడ్యూల్
1.హాకీ
పురుషుల సెమీఫైనల్: భారత్ X బెల్జియం- ఉదయం 7 గంటలకు
2. అథ్లెటిక్స్
మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్- గ్రూప్ ఏ ( అన్ను రాణి)- ఉదయం 5.50 గంటలకు
పురుషుల షాట్‌ఫుట్ క్వాలిఫికేషన్-(గ్రూప్ ఏ (తేజందర్ పాల్ సింగ్)- ఉదయం 3.45 గంటలకు
3. రెజ్లింగ్
మహిళల ఫ్రీ స్టైల్ 62 కేజీల 1/8 ఫైనల్( సోనమ్ మాలిక్(భారత్) vs బొలొర్తుయా ఖురెఖ్కు (మంగోలియా) - ఉదయం 8.30గంటలకు