Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tokyo 2020: పీవీ సింధుకు లాస్ట్ చాన్స్! ఒలింపిక్స్‌‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే!

What To Watch Today August 1 Tokyo Olympics Indian Schedule And Events

హైదరాబాద్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత్‌కు నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన స్వర్ణ పోరాటాన్ని సెమీస్‌లోనే ముగించింది. బాక్సర్లు అమిత్ పంఘల్, పూజారాణి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటి దారిపట్టారు. హాకీ మహిళలు అద్భుత విజయంతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. ఆర్చర్ అతాను దాస్ తీవ్రంగా నిరాశపరచగా..అథ్లెటిక్స్‌లో కమల్‌ప్రీత్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఆదివారం కూడా భారత్ అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా సింధు కాంస్య పోరులో చైనా ప్లేయర్ హే బింగ్ జియో‌తో తలపడనుంది.

ఒలింపిక్స్‌లో రేపటి(ఆగస్టు 1) భారత షెడ్యూల్

1. బ్యాడ్మింటన్

మహిళల సింగిల్స్ బ్రాంజ్ మెడల్ ఫైట్ (పీవీ సింధు vs హే బింగ్ జియో (చైనా) సాయంత్రం 5 గంటలకు

2. బాక్సింగ్
పురుషుల హెవీ వెయిట్(91+ కేజీలు) క్వార్టర్ ఫైనల్ (సతీశ్ కుమార్ vs బకోదర్ జలోలోవ్(ఉజ్బెకిస్తాన్)-ఉదయం 9.30 గంటలకు

మహిళల మిడిల్ వెయిట్(69-75 కేజీ) క్వార్టర్ ఫైనల్ 4 (పూజా రాణి vsకియాల్ లి (చైనా)) మధ్యాహ్నం 3.36 గంటలకు

3. హాకీ

పురుషుల క్వార్టర్ ఫైనల్ - భారత్ vs గ్రేట్ బ్రిటన్- సాయంత్ర 5.30 గంటలకు

4. గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4(అనిర్బన్ లాహిరి) ఉదయం 5.55 గంటలకు

పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4(ఉదయన్ మానే)- ఉదయం 4.11 గంటలకు

5. ఈక్వెస్ట్రెయిన్
క్రాస్ కంట్రీ ఈవెంటింగ్ టీమ్, వ్యక్తిగతం- ఉదయం 4.15 గంటలకు

Story first published: Saturday, July 31, 2021, 20:47 [IST]
Other articles published on Jul 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+