Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన విశాల్ టీకే.. రన్నింగ్ రేస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్!

భారత స్ప్రింటర్ విశాల్ టీకే చరిత్ర సృష్టించాడు. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే అతితక్కువ సమయంలో 400 మీటర్ల రేసును పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో శనివారం 400 మీటర్ల రేసును విశాల్.. 44.98 సెకన్లలో పూర్తిచేశాడు. దాంతో తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.

గతేడాది విశాల్ టీకే 45.12 సెకన్లతో జాతీయ రికార్డును అధిగమించాడు. 400 మీటర్ల పరుగు రేసును 45 సెకన్లలోపు పూర్తి చేయడం భారత అథ్లెట్లకు చాలా ఏళ్లుగా సవాల్‌గా మారిందిఈ సవాల్‌ను తమిళనాడుకు చెందిన డీకే విశాల్ ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Vishal TK Smashes Men s 400m National Record At Federation Cup 2026 With Spectacular Sprint

ఇది చారిత్మాత్మక విజయమే అయినప్పటికీ.. కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించడానికి ఈ టైమింగ్ సరిపోదు. కామన్వెల్త్ గేమ్స్‌కు క్వాలిఫై కావాలంటే 44.96 సెకన్లలో 400 మీటర్ల రేసును పూర్తి చేయాలి. ఈ ఫీట్‌కు విశాల్ 0.02 సెకన్ల దూరంలో నిలిచిపోయాడు.

స్వల్ప తేడాతో కామన్వెల్త్ గేమ్స్‌ బెర్త్‌ను కోల్పోయినప్పటికీ.. ఆసియాలోనే అత్యుత్తమ 400 మీటర్ల స్ప్రింటర్‌గా విశాల్ నిలిచాడు. ఇదే టోర్నీలో పంజాబ్‌కు చెందిన గురిందర్‌వీర్ సింగ్ 100 మీటర్ల రేసును 10.09 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డ్ నమోదు చేశాడు.

400 మీటర్ల తుది ఫలితాలు:

విశాల్ టీకే. - 44.98 సెకన్లు (కొత్త జాతీయ రికార్డు)
రాజేష్ రమేష్ - 45.31 సెకన్లు
జై కుమార్ - 45.47 సెకన్లు
మను డి.ఎస్. - 45.70 సెకన్లు
ధర్మవీర్ చౌదరి - 45.85 సెకన్లు

సరికొత్త నేషనల్ రికార్డ్స్ నమోదు చేసిన విశాల్ టీకే, గురిందర్ వీర్ సింగ్‌లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రదర్శన భవిష్యత్తులో అత్యున్నత వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తారనే నమ్మకం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా మినహా మరే భారత అథ్లెట్ ఒలింపిక్ మెడల్ సాధించలేదు. ఆ లోటును తీర్చే దిశగా అథ్లెటిక్స్ క్రీడాకారులను భారత ప్రభుత్వ ప్రోత్సహిస్తోంది.

Story first published: Saturday, May 23, 2026, 22:09 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+