Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ఖేల్‌రత్న’కు వినేశ్‌ ఫొగాట్

 Vinesh Phogat To Be Nominated For Khel Ratna

న్యూఢిల్లీ: భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న' బరిలో వరుసగా రెండో ఏడాది నిలిచింది. వినేశ్‌ పేరును గతేడాదే ఈ అవార్డుకు నామినేట్‌ చేసినప్పటికీ బజరంగ్‌ పూనియాను అదృష్టం వరించింది. ఈ మూడేళ్లలో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ (2019)లో కాంస్యం, ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన వినేశ్‌... టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్న ఏకైక భారత మహిళా రెజ్లర్‌ కావడం విశేషం. దీంతో ఆమె పేరును రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 'ఖేల్‌రత్న' కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.

మరోవైపు రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ 'అర్జున అవార్డు' కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. 2016లోనే కేంద్రం ఆమెను 'ఖేల్‌రత్న'తో సత్కరించింది. ఇతర రెజ్లర్లు దీపక్‌ పూనియా, రాహుల్‌ అవారే, సందీప్‌ తోమర్‌ 'అర్జున అవార్డు'ను ఆశిస్తున్నారు. ఈ మేరకు సమాఖ్యకు దరఖాస్తులు సమర్పించారు.

'ఖేల్‌రత్న పురస్కారానికి వినేశ్ ఫొగాట్ పేరు సిఫార్లు చేస్తున్నాం. ఆమె దరఖాస్తును సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపిస్తాం. ఆ అవార్డుకు ఆమె గట్టి పోటీదారురాలు. అయితే అర్జున అవార్డు‌కు మాత్రం ఇంకా ఎవరిని ఖారారు చేయలేదు. ఎందుకంటే మాకు చాలా దరఖాస్తులు వచ్చాయి. ఎవరి పేరు సిఫార్స్ చేయాలనేది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌ నిర్ణయిస్తారు.'అని డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. బుధవారం వరకు గడవున్నా సోమవారమే అందరి దరఖాస్తులను పంపిస్తామన్నారు.

Story first published: Monday, June 1, 2020, 10:41 [IST]
Other articles published on Jun 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+