Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను మెడల్స్ గెలుస్తానని భయపడుతున్నారు: వినేష్ ఫొగాట్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ)పై స్టార్ రెజ్లర్, హర్యానా ఎమ్మెల్యే వినేష్ ఫొగాట్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసియా గేమ్స్‌లో తాను పాల్గొనకుండా ఉండాలనేదే డబ్ల్యూఎఫ్‌ఐ లక్ష్యమని చెప్పారు. ఈ టోర్నీలో తాను బరిలోకి దిగితే పతకాలు గెలుస్తానని డబ్ల్యూఎఫ్‌ఐ ప్రతినిధులు భయపడుతున్నారని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా వినేష్ ఫొగాట్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ నిషేధం విధించింది. డబ్ల్యూఎఫ్‌ఐ నిషేధాన్ని లెక్క చేయని వినేష్ ఫొగాట్.. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గొండాకు చేరుకుంది.

ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వినేష్ ఫొగాట్.. డబ్ల్యూఎఫ్‌ఐ నోటీసులకు క్లుప్తంగా సమాధానం ఇచ్చానని పేర్కొంది.

Vinesh Phogat Slams WFI as a Dictatorship Claims Officials Fear Her Potential Medal Success

'పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హతకు గురైన తర్వాత నా జీవితంలో ఆనందం కోల్పోయాను. కానీ, నా కుమారుడు క్రిధవ్ తిరిగి నాలో ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. వ్యవస్థపై పోరాడే శక్తి కూడా నా కొడుకు వల్లే వచ్చింది. నాకు శుక్రవారం రాత్రి డబ్ల్యూఎఫ్‌ఐ నోటీసు అందింది.

దానికి సమాధానమిచ్చేందుకు 14 రోజుల గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని సంజయ్‌‌సింగ్‌కు తెలియజేశాను. సమయం లేకపోవడం వల్లే క్లుప్తంగా ఆ నోటీసులకు బదులిచ్చాను. ముందుగా నన్ను పోటీ చేయనివ్వండి. 14 రోజుల తర్వాత నా సమాధానంతో సంతృప్తి చెందకపోతే చర్యలు తీసుకోవాలని సంజయ్‌ సింగ్‌ను కోరాను.

ఇందుకు ఆయన నిరాకరించారు. వివరణాత్మక సమాధానం ఇవ్వాలని చెప్పారు. 14-15 రోజుల తర్వాత కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నేను మళ్లీ పతకాలు గెలుస్తానని డబ్ల్యూఎఫ్‌ఐ ప్రతినిధులు భయపడుతున్నారు. అందుకే ఆసియా క్రీడల్లో నేను పాల్గొనకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. నేను రిటైర్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు.'అని వినేష్ ఫొగాట్ చెప్పుకొచ్చారు.

మరోవైపు వినేష్ ఫొగాట్ అనర్హత విషయంలో డబ్ల్యూఎఫ్‌పై పాత్ర లేదని మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్‌భూషణ్ సింగ్ స్పష్టం చేశారు. వినేష్ ఫొగాట్‌ ట్రయల్స్ పూర్తి చేసేలా అనుమతివ్వాలని మరో స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రధాన నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది.

Story first published: Tuesday, May 12, 2026, 17:18 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+