Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాపై కుట్ర చేస్తున్నారు: వినేశ్ ఫొగాట్

భారత స్టార్ రెజ్లర్, హర్యానా ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఉద్దేశపూర్వకంగా తన పునరాగమనాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికిన వినేశ్ ఫొగాట్.. ఇటీవలే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో పోటీపడతానని వెల్లడించారు.

అయితే తాను రీఎంట్రీ ఇవ్వకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రతినిధులు అడ్డుకుంటున్నారని ఆమె తాజాగా మీడియాకు తెలిపారు. ఆసియా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ట్రయల్స్ గడువు సమీపిస్తోన నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

'నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీతో పునరాగమనం చేయాలని అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ తుది గడువు ఏప్రిల్ 30 వరకు ఉంది. కానీ రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. గడువు ముగిసిందని సందేశం వస్తోంది. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలోని పాలనా యంత్రాంగాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించాను. కానీ వారు నా కాల్స్‌కు స్పందించడం లేదు.

Vinesh Phogat Alleges Wrestling Federation Of India Blocking Her Comeback WFI Denies Claims

ఫెడరేషన్ కప్ సమయంలోనూ ఇలానే జరిగింది. చివరి నిమిషంలో ఎంపిక ప్రమాణాలు మార్చారు. దాంతో నేను ఆ టోర్నీ ఆడలేకపోయాను. నా రీఎంట్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని అనిపిస్తోంది. ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పోటీలో ఉండాలంటే ఈ టోర్నీ ఆడటం ఎంతో కీలకం'అని వినేశ్ ఫొగట్ మీడియాతో అన్నారు.

అయితే వినేశ్ ఫొగట్ ఆరోపణలను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ సంజయ్‌సింగ్ ఖండించారు. చాలామంది రెజ్లర్లకు రిజిస్ట్రేషన్ విషయంలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. 'చాలా మంది రెజ్లర్లకు సమస్యలు తలెత్తాయి. వారు మా సిబ్బందిని సంప్రదించి సమస్యను పరిష్కరించకున్నారు. పోటీపడకుండా మేం ఎవర్నీ అడ్డుకోం. టోర్నీ అందరికీ అందుబాటులో ఉంటుంది.'అని స్పష్టం చేశారు.

Story first published: Tuesday, April 28, 2026, 15:27 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+