న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ultimate Kho Kho: ప్చ్.. ఒక్క పాయింట్‌తో చేజారిన టైటిల్! ఫైనల్లో ఒడిశా చేతిలో ఓడిన తెలుగు యోధాస్!

Ultimate Kho Kho season 1 winner Odisha Juggernauts after win against Telugu Yoddhas in final

పుణే: అల్టిమేట్ ఖో ఖో ఆరంభ సీజన్‌ టైటిల్‌ను ఒడిశా జాగర్‌నాట్స్ గెలుచుకుంది. తెలుగు యోధాస్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఈ ఫ్రాంచైజీ ఒక్క పాయింట్‌తో గెలిచింది. ఒడిశా అటాకర్ సూరజ్ లాండే సెన్సేషనల్ స్కై డైవ్‌తో ఒడిశా ఆరంభ సీజన్ చాంపియన్‌గా అవతరించింది. ఆఖరి సెకన్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒడిశా 46-45 తేడాతో తెలుగు యోధాస్‌ను ఓడించింది. అచ్చం క్రికెట్ తరహాలోనే అనేక మలుపులు తిరికి ఈ ఖోఖో ఫైనల్ మ్యాచ్‌ అభిమానులను కనువిందు చేసింది. విజేతగా నిలిచిన ఒడిశా జాగర్‌నట్స్ జట్టుకు కోటిరూపాయల నజరాన దక్కగా.. రన్నరప్ తెలుగు యోధాస్‌ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది.

మ్యాచ్ విషయానికి వస్తే ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్ట్ టర్న్‌లో ఒడిశా డిఫెండర్ విశాల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 4 నిమిషాల 23 సెకండ్ల పాటు డిఫెండ్ చేసి 8 బోనస్ పాయింట్లు అందించాడు. కెప్టెన్ దిపేశ్, దిలీప్ 2.37 నిమిషాల పాటు తప్పించి మరో రెండు పాయింట్లు రాబట్టారు. దాంతో తొలి టర్న్‌లో ఒడిశా 10-10తో నిలిచింది.

డిఫెన్సివ్‌లో రికార్డు పాయింట్స్ సాధించిన తెలుగు యోధాస్.. అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆదర్ష్ మోహిత్ 4.12 నిమిషాల పాటు డిఫెన్స్ చేసి పాయింట్స్ అందించాడు. మొత్తంగా తెలుగు యోధాస్ 10 పాయింట్లు సాధించి ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 20-23తో వెనుకబడింది. మూడో టర్న్‌లో తమదైన అటాకింగ్‌తో 21 పాయింట్లు సాధించిన తెలుగు యోధాస్ 41-27తో భారీ ఆధిక్యం సాధించింది.

ఒడిశా తరఫున సచిన్ భార్గో కీలక పాయింట్లు సాధించాడు. ఇక చివరి టర్న్‌లోనూ ఆఖ నిమిషం లీడ్‌లో ఉన్న తెలుగు యోధాస్.. మ్యాచ్ ముగుస్తుందగా పాయింట్స్ కోల్పోయి ఓటమిపాలైంది. మ్యాచ్‌లో 14 సెకండ్ల టైమ్ మిగిలుందనగా.. అవదుట్ పాటిల్‌ను సూపర్ స్కైడైవ్‌తో మూడు పాయింట్లు అందుకోని టైటిల్ ఎగరేసుకుపోయింది.

Story first published: Sunday, September 4, 2022, 21:56 [IST]
Other articles published on Sep 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X