For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ultimate Kho Kho: తెలుగు యోధాస్‌కు మరో విజయం.. కొనసాగుతున్న గుజరాత్ జోరు!

Ultimate Kho Kho 2022: Telugu Yoddhas and Gujarat Giants clinch second wins on the trot

పుణె: అల్టిమేట్‌ ఖో ఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో తెలుగు యోధాస్ దుమ్మురేపుతోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆదర్శ్‌ మోహిత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టడంతో తెలుగు యోధాస్‌ 68-47 స్కోరు తేడాతో రాజస్థాన్‌ వారియర్స్‌ను చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 30-20తో ఆధిక్యంలో ఉన్న యోధాస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదేజోరుతో విజృంభించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ఆదర్శ్‌తో పాటు ప్రసాద్‌ తెలుగు జట్టులో రాణించాడు. తెలుగు యోధాస్ సాధించిన 68 పాయింట్లలో 22 ట్యాకిల్,16 స్కై డైవ్స్, 6 పోల్ డైవ్స్, 6 ఇతర డైవ్స్, 12 టచ్ పాయింట్స్ ఉన్నాయి.

మరో మ్యాచ్‌లో ఒడిశా జగ్గర్‌నట్స్‌పై గుజరాత్ జెయింట్స్ గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో గుజరాత్ 54-49 తేడాతో ఒడిశాను ఓడించింది. గుజరాత్ 18 అటాక్, 12 డైవ్స్, 12 టచ్ పాయింట్స్ సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఖిలాడీస్, చెన్నై క్విక్ గన్స్‌తో తెలుగు యోధాస్ తలపడుతాయి.

రాత్రి 7.30 నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. సోనీ టెన్ టీవీలో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ టెన్ 4లో తెలుగు కామెంట్రీతో మ్యాచ్‌లు ప్రసారం అవుతున్నాయి. వరుసగా రెండు విజయాలతో 6 పాయింట్లు సాధించిన తెలుగు యోధాస్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. అన్నే పాయింట్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది.

Story first published: Wednesday, August 17, 2022, 7:53 [IST]
Other articles published on Aug 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+