Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Commonwealth Games 2026: డోపింగ్‌లో దొరికిన భారత ఆటగాళ్లు.. సస్పెండ్!

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నీ నేపథ్యంలో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్‌ల్లో దొరకడంతో భారత జుడోకా అరుణ్ కుమార్, వెయిట్ లిఫ్టర్ దిల్‌బాగ్ సింగ్ కామెన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యారు. 73 కేజీల జుడోకా విభాగంలో పోటీ పడుతున్న అరుణ్ కుమార్ నిషేదిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది.

దాంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) అరుణ్‌పై తాత్కలిక నిషేధం విధించింది. ఈ విషయాన్ని జాతీయ జుడో సమాఖ్య వర్గాలు ధృవీకరించాయి.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలపై అంచనాలొద్దు: గోపిచంద్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలపై అంచనాలొద్దు: గోపిచంద్

తులిక మాన్‌పై వేటు..

భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ తులిక మాన్‌‌పై కూడా వేటు పడింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది.

కామన్వెల్త్ గేమ్స్‌లో జుడో పోటీలు ఈ నెల 31న మొదలవ్వనున్నాయి. భారత జుడో బృందం జూలై 27న అక్కడికి వెళ్లనుంది. గత కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జుడో విభాగంలో మూడు పతకాలు సాధించింది.

Two Indian Athletes withdrawn from Commonwealth Games 2026 due to doping violations

దిల్‌బాగ్ సింగ్‌పై వేటు..

వెయిట్ లిఫ్టర్ దిల్‌బాగ్ సింగ్‌ను కూడా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పించారు. అతను డోపింగ్ పరీక్షల్లో ప్రత్యక్షంగా పాల్గొననప్పటికీ, జూన్ 1, 2025 నుంచి జూలై 22, 2026 మధ్య అతను ఐదు సార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యాడు. అంతేకాకుండా అతను వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో సన్నాహక శిబిరంలో పాల్గొనలేదు. దాంతో తమ కోటాను 12 నుంచి 11కు తగ్గించినట్లు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య పేర్కొంది.

డోపింగ్ టెస్ట్‌ల్లో భారత ఆటగాళ్లు విఫలమయ్యారనే ఘటనపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డోపింగ్ సంస్కృతిని నిర్మూలించేందుకు, డోపింగ్‌ను క్రిమినల్ చట్ట పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే?

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే?

ఈ ఇద్దరి సస్పెన్షన్‌తో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్ల సంఖ్య 126 నుంచి 124కు తగ్గింది. కామన్వెల్త్ రూల్స్ ప్రకారం డోపింగ్‌లో పట్టుబడిన ఆటగాళ్ల స్థానాల్లో ఇతరులను చేర్చుకోవడానికి వీలు లేదు.

Story first published: Friday, July 24, 2026, 17:50 [IST]
Other articles published on Jul 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+