న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారు కోసం రాష్ట్రాన్ని కించపరుస్తావా!: దీపాపై త్రిపుర సర్కార్‌ ఫైర్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌‌కు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సచిన్ చేతుల మీదగా అందుకున్న ఖరీదైన బీఎండబ్ల్యూ కారును దీపా కర్మార్కర్ వెనక్కి ఇచ్చేస్తానని చేసిన ప్రకటనపై త్రిపుర ప్రభుత్వం మండిపడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఆమె నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టమని, తగిన సర్వీస్‌ సెంటర్లు కూడా లేనందున.. బీఎండబ్ల్యూను వెనక్కి తీసుకొని.. దానికి తగిన నగదు కోరడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని సహా విదేశీ ప్రముఖుల కార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తిరిగాయని మంత్రి బాదల్‌ పేర్కొన్నారు.

BMW

అయితే సొంత రాష్ట్రాన్ని కించపరిచేలా మట్లాడిన దీపా కర్మార్కర్‌కు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని త్రిపుర రవాణా మంత్రి మాణిక్‌దేవ్‌ అన్నారు. మరోవైపు సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం చాలా గొప్ప విషయమని అలాంటి కారుని తిరిగిచ్చే ప్రసక్తే లేదని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తేల్చి చెప్పింది.

సచిన్ ఇచ్చిన గిప్ట్ అది: కారు వార్తలపై దీపా స్పందన

సచిన్ చేతుల మీదుగా అందుకున్న బీఎండబ్ల్యూ కారును భరించే శక్తి లేదని, ఆ కారుని తిరిగి ఇచ్చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. ఆ కారును తిరిగి ఇచ్చే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

సచిన్‌కు షాక్!: బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేస్తున్న దీపా దీపా నుంచి తిరిగి కారుని తీసుకునేందుకు కారును స్పాన్సర్ చేసిన చాముండేశ్వరినాథ్ కూడా విముఖత వ్యక్తం చేశారు. అంత అట్టహాసంగా సచిన్ చేతుల మీదుగా ప్రదానం చేసిన గిప్ట్‌ని ఇంత చిన్న కారణం చేత తిరిగి తీసుకోకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చారు. బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ అగర్తలాలో పెట్టించేందుకు ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X