Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టోక్యో ఒలింపిక్స్ ‘జ్యోతి’ వెలిగింది!

Torch relay for Tokyo Olympics 2020 kicks off its 121-day journey

టోక్యో: అన్ని సందేహాలను పటాపంచలు చేస్తూ.. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై ఆశలు రేపుతూ 'టార్చ్‌ రిలే' కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. 2011లో భూకంపం, సునామీ, న్యూక్లియర్‌ విస్ఫోటనాల ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఫుకుషిమా వద్ద ఈ జ్యోతిని వెలిగించి పరుగు ప్రారంభించడం విశేషం. 2011 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. మిగతా జట్టు సభ్యులు నిలబడి ఉండగా.. ఇవాషిముజ్.. జే విలేజ్ నుంచి రిలేను కొనసాగించింది. కొవిడ్-19 వల్ల ఈ కార్యక్రమానికి ప్రేక్షకులను అనుమతించలేదు.

జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే టార్చ్‌ 121 రోజుల తర్వాత క్రీడల ప్రారంభం రోజైన జులై 23కు టోక్యో చేరుకుంటుంది. 'జపాన్‌ దేశవాసులకే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రజలకు కూడా టోక్యో 2020 జ్యోతి కొత్త వెలుగులు పంచుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత కష్టకాలంలో చీకటి తర్వాత వెలుతురు ఉంటుందనే సందేశంతో టార్చ్‌ పయనిస్తుంది' అని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమొటో వ్యాఖ్యానించారు.

Story first published: Friday, March 26, 2021, 8:34 [IST]
Other articles published on Mar 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+