Mirabai Chanu: భారత వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ సక్సెస్ స్టోరీ.. అచ్చం ధోనీ తరహాలోనే!

హైదరాబాద్: 21 ఏళ్ల నీరీక్షణకు తెరదించుతూ భారత వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను రజతంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఈ మణిపూర్ మణిపూస.. భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది. చైనాకు చెందిన హౌ జిహోయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న మీరాబాయి స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. స్నాచ్‌లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.
ఇక క్లీన్ అండ్ జర్క్‌లో అద్భుతమే చేసింది. మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తింది. అయితే కాంస్యం గెలిచిన విండీ కాంటిక క్లీన్ అండ్ జర్క్‌లో ఎత్తిన అత్యధిక బరువు 110 మాత్రమే. దాంతో మీరాకు పతకం ఖాయమని అర్థమైపోయింది. రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా.. మెరుగైన రికార్డు కోసం 117 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.

కరణం మళ్లీశ్వరీ తరువాత..
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పెద్దగా విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో సత్తా చాటిందే లేదు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి భారత్ పోటీపడింది. అప్పటి నుంచి ప్రస్తుతం జరగుతున్న టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు భారత్ సాధించింది ఒకే ఒక్క మెడల్. అది కూడా మన తెలుగు తేజం కరణం మళ్లీశ్వరీ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఆమె తర్వాత మళ్లీ భారత్‌కు మీరాబాయి చాను రూపంలో పతకం దక్కింది.

ఎవరీ మీరాబాయి..?
ఇక మీరాబాయి చాను 1994 ఆగస్టు 8న మణిపూర్ రాజధాని అయిన ఇంపాల్‌కు సమీపంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించింది. ఆరుగురి సంతానంలో ఆమె చిన్నది. చిన్నప్పటి నుంచే చాను వారి తల్లితండ్రులు, కజిన్స్‌కు పనుల్లో సాయం చేసేది. అప్పుడే పెద్ద పెద్ద బరువులు మోసేది. అయితే మీరాబాయి సోదరులు, కజిన్స్ ఫుట్‌బాల్ ఆడి మురికిగా మారేవారని, దాంతో శుభ్రంగా ఉండే ఆటలను ఎంచుకోవాలని తొలుత భావించింది. ఈ క్రమంలోనే నీట్‌గా స్టైలీష్‌గా ఉండే ఆర్చర్ కావాలనుకుంది. కానీ మణీపూర్ వెయిట్ లిఫ్టర్ కుంజరణి దేవీని చూసి మీరాబాయి తన మనసును మార్చుకుంది. ఆమెను స్పూర్తిగా తీసుకున్న చాను.. వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.

అచ్చం ధోనీలానే..
అయితే వెయిట్ లిఫ్టర్‌గా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు పడింది. స్కూల్‌కు ట్రైనింగ్ తీసుకునేందుకు రోజు ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణం చేసిది. రెండు బస్సులు మారేది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే చాను సైతం స్పోర్ట్స్ కోటాలో రైల్వే టికెట్ ఎగ్జామినర్ ఉద్యోగం సాధించింది. దాంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన ఆటపై దృష్టిసారించింది. అనతి కాలంలో దేశంలో మేటీ లిఫ్టర్‌గా గుర్తింపు పొంది రియో ఒలింపిక్స్ బరిలోకి దిగింది.

రియోలో విఫలమైనా..?
రియో ఒలింపిక్స్‌లో మూడు ప్రయత్నాల్లో కనీస బరువు కూడా ఎత్తలేకపోయింది. ఆ ఘోర అవమానం తర్వాత.. చాను తన టెక్నిక్‌లోని లోపాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా స్నాచ్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను సరిచేసుకుంది. వెంటనే 2017లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. ఆ పెర్ఫామెన్స్ అనంతరం అమెరికా వెళ్లి 45 రోజుల ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన చాను.. క్లీన్ జర్క్‌లో 119 కేజీల బరువెత్తి వరల్డ్ రికార్డు సృష్టించింది. స్కాచ్‌లో 86 కేజీల బరువు మోసింది. అంతకు ముందు 2018 కాన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తనపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టోక్యోలో మెరిసి విశ్వవేదికపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications