2021లో జరిగినా టోక్యో ఒలింపిక్స్ 2020నే!!

అందరూ అనుకున్నదే జరిగింది. టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. ప్రపంచ యుద్దాలు వచ్చినప్పుడు మాత్రమే ఆగిన విశ్వ క్రీడా సంబురం ఈ సారి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు నిలిచిపోయింది. మానవాళి మనుగడకే ముప్పుగా మారిన ఈ వైరస్ విజృంభిస్తుండగా.. మెగా ఈవెంట్‌ను నిర్వహించే పరిస్థితి లేదని ఆతిథ్య జపాన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒప్పుకున్నాయి. జపాన్ ప్రధాని షింజో అబెనే స్వయంగా ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఈ వాయిదా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.

జపాన్ ప్రధాని ప్రతిపాదన..
‘ఒలింపిక్స్‌ను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని నేను ప్రతిపాదించాను. ఐఓసీ అధ్యక్షుడు దానికి వంద శాతం అంగీకరిస్తున్నట్లు సమాధానమిచ్చారు' అని జపాన్ ప్రధాని షింజో అబె ప్రకటించారు.
అనంతరం ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం. అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 32వ ఒలింపిక్ క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయించాం. 2020 ముగిసిన తర్వాత 2021 వేసవిలోగా వీటిని నిర్వహిస్తాం' అని ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు.

ఏడాదిని మార్చడం లేదు!
టోక్యో ఒలింపిక్స్ 2021కు వాయిదా పడినా... అధికారిక నిర్వహణలో మాత్రం అదే సంవత్సరాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగినప్పుడు కూడా ఇవి ‘టోక్యో 2020' పేరుతోనే జరుగుతాయి. టోక్యో 2020 గేమ్స్ లోగోలతో ఇప్పటికే సిద్ధం చేసిన టీ షర్ట్‌లు, ఇతర జ్ఞాపికలతో కూడిన ‘మర్కండైజ్'ను అమ్ముకునే అవకాశం వృథా చేయకూడదనే కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

జ్యోతి కూడా జపాన్‌లోనే...
ఒలింపిక్స్ వాయిదా పడినా జ్యోతి మాత్రం ఏడాది పాటు జపాన్‌లోనే ఉంటుంది. ‘ప్రపంచం మొత్తం తీవ్ర విషాదంలో ఉన్న ఇలాంటి సమయంలో టోక్యో నగరం భవిష్యత్తు ఆశలకు సంకేతంలా ఉండాలని మేం భావిస్తున్నాం. కష్టకాలంలో ఒలింపిక్ జ్యోతి కూడా చీకటిలో చిరుదివ్వెలాంటిది. అందుకే ఒలింపిక్ జ్యోతిని టోక్యోలోనే ఉంచాలని నిర్ణయించాం' అని కమిటీ ప్రకటించింది. అయితే రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన టార్చ్ రిలేను మాత్రం నిలిపివేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications