Tokyo Oympics 2021: భారత షెడ్యూల్, టైమింగ్స్, చానెల్స్ వివరాలు! ఫ్రీగా చూడాలంటే..?

హైదరాబాద్: ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన టోక్యో ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. టిక్... టిక్... టిక్... అంటూ ఈ సమ్మర్ గేమ్స్‌కు శుక్రవారం జేగంట మోగనుంది. తొలిరోజు ఆరంభోత్సం... జపాన్ కళలతో, కళాకారులతో అలరించేందుకు ముస్తాబైంది. ఆ వెంటనే పోటీలు... పతకాల పట్టికను అంకెలతో నింపేయనున్నాయి.
అయితే ఇది జపాన్‌లో జరగనుండటం.. కరోనాతో అభిమానులకు అనుమతి లేకపోవడంతో టీవీ ప్రేక్షకులకు కనులపంట కానుంది. టీవీల్లో కరోనా కేసులు-న్యూస్‌లతో విసిగెత్తిన పెద్దలు, ఆన్‌లైన్ చదువు బుర్రకెక్కని పిల్లలు, మొబైల్ గేమ్ బోర్ కొట్టిన కుర్రాళ్లు కొత్తగా వెరైటీగా చూడాలనుకుంటే టోక్యో ఒలింపిక్స్ చూడొచ్చు. మన టైమింగ్‌కు సరిపోయే షెడ్యూల్ మనకు భలే వినోదాన్ని అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఆ రెండు చానెల్స్‌లో
టోక్యో ఒలింపిక్స్‌ను భారత్‌లో సోనీ నెట్‌వర్క్‌తోపాటు దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. సోనీ టెన్ 1, 3, 4 చానెల్స్‌లో ఈ సమ్మర్ గేమ్స్ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక సోనీ లివ్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా మొబైల్‌లో మ్యాచ్‌లు చూడవచ్చు. ఫ్రీగా చూడాలనుకునేవారు జియో టీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు. జియో టీవీ నుంచి సోనీటెన్ చానల్స్‌ను ఎలాంటి రుసుము లేకుండా వీక్షించవచ్చు. దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్‌లో కూడా ఉచితంగానే చూడవచ్చు.

ఉదయమే షురూ
భారత కాలమానం ప్రకారం వేకవజాము 4 గంటల 30 నిమిషాలకే టోక్యో గేమ్స్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో మాములుగానే ఈ వేడుకలను మమా అనిపించనున్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో లో విశ్వ రూపం చూపించేందుకు స్టార్లు సిద్ధమైన వేళ... ఈ పక్షం రోజులు ప్రతీ క్రీడాభిమాని పండగ చేసుకోనున్నారు. ప్రతీ రోజు ఆటలు భారత కాలమానం ప్రకారం వేకువ జాము 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ప్రతీ రోజు భారత పోటీలున్నాయి.

ఆర్చరీ పోటీలు..
ఇక మెగా గేమ్స్ తొలి రోజు భారత ఆర్చరీ క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముచ్చటగా మూ డోసారి ఒలింపిక్ బరిలోకి దిగుతున్న టాప్ ర్యాంకర్ దీపికా కుమారి వ్యక్తిగత రజతం సాధిస్తుందని లెక్కిస్తున్నారు. మిక్స్‌డ్‌లో భార్యభర్తలు దీపిక-అతాను దాస్ అద్భుతం చేస్తారని భావిస్తుండగా.. పురుషుల రికర్వ్ టీమ్ కాంస్యంతో వెనుదిరగవచ్చు.


భారత షెడ్యూల్..
1. ఆర్చరీ..
జూలై 23: పురుషుల, మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్. ఉదయం 5.30 గంటలకు ప్రారంభం.
జూలై 24: మిక్స్‌డ్ టీమ్ ఎలిమినేషన్స్, మెడల్ మ్యాచ్‌లు-అతాను దాస్, దీపిక కుమారి. ఉదయం 6 గంటలకు షురూ.
జూలై 26: పురుషుల టీమ్ ఎలిమినేషన్స్, మెడల్ మ్యాచ్‌లు-అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్. ఉదయం 6 గంటలకు ప్రారంభం
జూలై 27 నుంచి 30: పురుషుల, మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్స్, మెడల్ మ్యాచ్‌లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications