Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్ సన్నాహకల కోసం టర్కీకీ ఇండియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు!

Tokyo Olympics: Neeraj Chopra, Hima Das set for training-cum-competition stint in Turkey

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ ఇండియా స్టార్ అథ్లెట్లు తమ ప్రిపరేషన్స్ స్పీడ్‌ను పెంచారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్పింటర్ హిమ దాస్ సహా ఇండియా టాప్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఈ నెల చివర్లో టర్కీ టూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ట్రైనింగ్‌తో పాటు కాంపిటీషన్స్‌లో పాల్గొంటారని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) ప్రెసిడెంట్ ఆదిల్ సమరివాలా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చోప్రాతో పాటు ఒలింపిక్స్ రేసులో ఉన్న మరో జావిలిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్, ఇండియా రిలే రేసర్స్(4X100 మీటర్లు, 4X400 మీటర్ల పురుషులు, మహిళలు), కోచ్‌లు కలిపి మొత్తం 40 ప్లస్ మెంబర్స్‌తో కూడిన టీమ్ టర్కీ వెళ్లనుంది.

ట్రైనింగ్‌తో పాటు..

ట్రైనింగ్‌తో పాటు..

అంటాల్య బేస్‌గా శిక్షణ తీసుకోవడంతో పాటు అథ్లెట్లు పలు కాంపిటీషన్స్‌లో పోటీ పడతారు. వీటి ద్వారా కొంత మంది ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించే అవకాశం ఉంది. ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్ కోసం టర్కీ వెళ్లే టీమ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నుంచి అనుమతి వచ్చిందని సమరివాలా చెప్పారు. అథ్లెట్లందరికీ వీసాలు ఇప్పించేందుకు ఏఎఫ్ఐ పని చేస్తోందన్నారు. టర్కీలో వాళ్లకు టాప్ క్లాస్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు.

వరల్డ్ అథ్లెటిక్స్‌కు హిమ, ద్యుతి

వరల్డ్ అథ్లెటిక్స్‌కు హిమ, ద్యుతి

టర్కీలో స్టార్ స్పింటర్ హిమ దాస్ 4X100 రిలే టీమ్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకోనుంది. అలాగే పోలాండ్‌లో మే 1,2వ తేదీల్లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో పోటీపడే 4X100 రిలే టీమ్‌కు హిమతో పాటు ద్యుతీ చంద్, ధనలక్ష్మి, అర్చన, హిమశ్రీ, ధనేశ్వరి ఎంపికయ్యారు. పురుషులు 4×400 మీ, మహిళలు 4×400 మీటర్ల రిలేల్లోనూ భారత్‌ పోటీపడుతోంది.

మెన్స్ టీమ్‌లో..

మెన్స్ టీమ్‌లో..

పురుషుల జట్టులో జాకబ్‌, నాగనాథన్‌, మహ్మద్‌ అనాస్‌, రాజీవ్‌, సార్థక్‌, ధరుణ్‌, నిర్మల్‌ తోమ్‌ ఉండగా.. మహిళల రిలేలో పూవమ్మ, శుభ, అంజలి దేవి, రేవతి, విస్మయ, జిస్నా మాథ్యూ, కిరణ్‌ ఉన్నారు. రిలేల్లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. 2019 దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరడం ద్వారా 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే జట్టు ఇప్పటికే టోక్యో బెర్తు సాధించింది.

Story first published: Wednesday, April 7, 2021, 8:48 [IST]
Other articles published on Apr 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+