Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tokyo Oympics 2021 బరిలోకి దిగే భారత బలగం ఇదే.. 18 క్రీడాంశాల్లో 127 మంది అథ్లెట్లు! పతకాలెన్నో?

 Tokyo Olympics: Indian Athletes full list who qualified To Olympics 2021

హైదరాబాద్: భారత ఒలింపిక్‌ చరిత్రలో అత్యధికంగా 2012 లండన్‌ గేమ్స్‌లో ఆరు పతకాలు సాధిస్తే.. 2016 రియోకు వచ్చే సరికి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. మరి ఈసారైన ఆ సంఖ్య మెరుగవుతుందా? అని యావత్ భారత్ ఎదురుచూస్తోంది. రియో క్రీడల్లో భారత్‌ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగితే రెండే వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగింది. 18 క్రీడాంశాల్లో 119 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం... మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుండటంతో... టోక్యో ఒలింపిక్స్‌లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూలేని విధంగా ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో టోక్యో బరిలో నిలిచే భారత బలగం, షెడ్యూల వివరాలు మీ కోసం.!

ట్రాక్ అండ్ ఫీల్డ్( అథ్లెటిక్స్‌) (26)

ట్రాక్ అండ్ ఫీల్డ్( అథ్లెటిక్స్‌) (26)

పురుషుల విభాగం

జావెలిన్‌ త్రో: నీరజ్‌ చోప్రా, శివపాల్‌ సింగ్‌

20 కి.మీ. నడక: కేటీ ఇర్ఫాన్‌ థోడి, సందీప్‌ కుమార్, రాహుల్‌ రోహిల్లా

50 కి.మీ. నడక: గుర్‌ప్రీత్‌ సింగ్‌

3000 మీ. స్టీపుల్‌ఛేజ్‌: అవినాశ్‌ సాబ్లే

లాంగ్‌జంప్‌: శ్రీశంకర్‌

షాట్‌పుట్‌: తజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌

400 మీటర్ల హర్డిల్స్‌: జాబిర్‌

4X400 మీటర్ల రిలే: అమోల్‌ జేకబ్, రాజీవ్‌ అరోకియా, మొహమ్మద్‌ అనస్, నాగనాథన్‌ పాండి, నోవా నిర్మల్‌ టామ్‌.

మహిళల 20 కి.మీ. నడక: భావన జట్, ప్రియాంక గోస్వామి

డిస్కస్‌ త్రో: కమల్‌ప్రీత్, సీమా పూనియా

100, 200 మీటర్లు: ద్యుతీచంద్‌

జావెలిన్‌ త్రో: అన్ను రాణి

మిక్స్‌డ్‌ 4X400 మీటర్ల రిలే: సార్థక్‌ బాంబ్రీ, అలెక్స్‌ ఆంటోనీ, రేవతి వీరణమి, సుభా వెంకటేశన్, ధనలక్ష్మి శేఖర్‌

షెడ్యూల్‌: జూలై 30 నుంచి ఆగస్టు 7

 ఆర్చరీ (4)

ఆర్చరీ (4)

పురుషుల రికర్వ్‌ టీమ్, వ్యక్తిగత విభాగం: తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్‌; మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం: దీపిక కుమారి

షెడ్యూల్‌: జూలై 23 నుంచి 31వరకు పోటీలు జరగనున్నాయి. సమ్మర్ గేమ్స్‌లో భారత్ పోటీపడుతున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే.

బ్యాడ్మింటన్‌ (4)

బ్యాడ్మింటన్‌ (4)

మహిళల సింగిల్స్‌: పీవీ సింధు

పురుషుల సింగిల్స్‌: సాయిప్రణీత్‌

పురుషుల డబుల్స్‌: సాతి్వక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి

షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 2

ఈక్వెస్ట్రియన్‌ (1)

ఈక్వెస్ట్రియన్‌ (1)

పురుషుల వ్యక్తిగత ఈవెంటింగ్‌: ఫౌద్‌ మీర్జా

షెడ్యూల్‌: జూలై 30

ఫెన్సింగ్‌ (1)

ఫెన్సింగ్‌ (1)

మహిళల సాబ్రే ఈవెంట్‌: భవాని దేవి

షెడ్యూల్‌: జూలై 26

 హాకీ (38)

హాకీ (38)

పురుషుల జట్టు (19): శ్రీజేష్‌ (గోల్‌కీపర్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్, రూపిందర్‌ పాల్‌ సింగ్, సురేందర్‌ కుమార్, అమిత్‌ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హార్దిక్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్, మన్‌దీప్‌ సింగ్‌. స్టాండ్‌బై: వరుణ్‌ కుమార్, సిమ్రన్‌జిత్‌ సింగ్, కృషన్‌ పాఠక్‌ (గోల్‌కీపర్‌).

మహిళల జట్టు (19): సవితా పూనియా (గోల్‌కీపర్‌), రాణి రాంపాల్‌ (కెపె్టన్‌), షర్మిలా దేవి, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, వందన కటారియా, గుర్జిత్‌ కౌర్, నవ్‌జ్యోత్‌ కౌర్, నవ్‌నీత్‌ కౌర్, లాల్‌రెమ్‌సియామి, మోనిక, నేహా, నిషా, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, సవితా పూనియా, సలీమా టెటె. స్టాండ్‌బై: రీనా, నమితా టొప్పో, రజని (గోల్‌కీపర్‌).

షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 6

గోల్ఫ్‌ (3)

గోల్ఫ్‌ (3)

అనిర్బన్, అదితి అశోక్, ఉదయన్‌ మానె

షెడ్యూల్‌: జూలై 29 నుంచి ఆగస్టు 7

 జిమ్నాస్టిక్స్‌ (1)

జిమ్నాస్టిక్స్‌ (1)

మహిళల ఆర్టిస్టిక్‌: ప్రణతి నాయక్‌

షెడ్యూల్‌: జూలై 25 నుంచి ఆగస్టు 3

 రోయింగ్/ సెయిలింగ్/జూడో

రోయింగ్/ సెయిలింగ్/జూడో

రోయింగ్‌ (2)

పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌: అర్జున్‌ లాల్, అరవింద్‌ సింగ్‌

షెడ్యూల్‌: జూలై 24

సెయిలింగ్‌ (4)

మహిళల లేజర్‌ రేడియల్‌: నేత్ర కుమనన్‌

పురుషుల లేజర్‌ స్టాండర్డ్‌: విష్ణు శరవణన్‌

పురుషుల స్కీఫ్‌ 49 ఈఆర్‌: గణపతి, వరుణ్‌

షెడ్యూల్‌: జూలై 25 నుంచి 27

10. షూటింగ్‌ (15)

10. షూటింగ్‌ (15)

మహిళల విభాగం

అంజుమ్‌ మౌద్గిల్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌), తేజస్విని (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌), ఇలవేనిల్‌ (10 మీటర్ల ఎయిర్‌రైఫిల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), అపూర్వీ చండేలా (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), మనూ భాకర్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌), యశస్విని(10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), రాహీ సర్నోబత్‌ (25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌)

పురుషుల విభాగం

దివ్యాంశ్, దీపక్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), సంజీవ్‌ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌), సౌరభ్‌ చౌదరీ, అభిõÙక్‌ వర్మ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్, అంగద్‌ (స్కీట్‌ ఈవెంట్‌)

షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 2

స్విమ్మింగ్‌ (3)

స్విమ్మింగ్‌ (3)

పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌: సజన్‌

పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌: శ్రీహరి

మహిళల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌: మానా పటేల్‌

షెడ్యూల్‌: జూలై 25 నుంచి 30

 టేబుల్‌ టెన్నిస్‌ (4)

టేబుల్‌ టెన్నిస్‌ (4)

పురుషుల సింగిల్స్‌: శరత్‌ కమల్, సత్యన్‌

మహిళల సింగిల్స్‌: మనిక బత్రా, సుతీర్థ

మిక్స్‌డ్‌ డబుల్స్‌: శరత్‌ కమల్‌-మనిక బత్రా

షెడ్యూల్‌: జూలై 24 నుంచి 27

The History Of Olympic Games | ఒలింపిక్ క్రీడలు దాని చరిత్ర | Oneindia Telugu
 టెన్నిస్‌ (3)

టెన్నిస్‌ (3)

మహిళల డబుల్స్‌: సానియా, అంకిత రైనా

పురుషుల సింగిల్స్‌: సుమిత్‌ నగాల్‌

షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 1 వరకు

 రెజ్లింగ్/ వెయిట్ లిఫ్టింగ్

రెజ్లింగ్/ వెయిట్ లిఫ్టింగ్

రెజ్లింగ్‌ (7)

పురుషుల విభాగం: రవి (57 కేజీలు), బజరంగ్‌ (65 కేజీలు), దీపక్‌ (86 కేజీలు).

మహిళల విభాగం: సీమా (50 కేజీలు), వినేశ్‌ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), సోనమ్‌ (62 కేజీలు) షెడ్యూల్‌: ఆగస్టు 3 నుంచి 7

వెయిట్‌లిఫ్టింగ్‌ (1)

మహిళల 48 కేజీల విభాగం: మీరాబాయి

షెడ్యూల్‌: జూలై 24

బాక్సింగ్‌ (9)

బాక్సింగ్‌ (9)

పురుషుల విభాగం: సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు), అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు)

మహిళల విభాగం: మేరీకోమ్‌ (51 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు).

షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 8

Story first published: Thursday, July 22, 2021, 12:51 [IST]
Other articles published on Jul 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+