Tokyo Olympics: బాక్సర్ వికాస్ ఔట్.. రక్తం చిందించినా తప్పని ఓటమి! హర్యానా డీఎస్పీపై పిడిగుద్దులు!

టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత్‌కు మరో ఈవెంట్‌లో నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన బాక్సర్ వికాస్ క్రిషన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. పురుషుల వెల్టర్ వేయిట్ (69 కేజీల) విభాగంలో జపాన్ బాక్సర్ ఒకాజవాతో తలపడిన వికాస్ క్రిషన్ ఓటమిపాలయ్యాడు. మూడు రౌంర్లలో వికాస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన జపాన్ బాక్సర్ ఒకాజవా 5-0తో విజయం సాధించాడు.
తొలి రౌండ్ నుంచే వికాస్‌పై ఒకాజవా పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. దాంతో భారత బాక్సర్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ప్రత్యర్థిపైకి పదేపదే దూసుకెళ్లిన వికాస్.. పంచ్‌లు మాత్రం ఇవ్వలేకపోయాడు. ఒకాజవా ధాటికి వికాస్ గాయపడ్డాడు కూడా. అతని ముఖంపై ఒకజావా పిడిగుద్దులు గుద్దడంతో ముక్కులోంచి రక్తం కారింది. అయినా ఆఖరి వరకు పోరాడిన బాక్సర్ వికాస్ క్రిషన్ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ రౌండ్ ఫలితం తేల్చేందుకు 5గురు జడ్జీలు పెద్దగా సమయం కూడా తీసుకోలేదు. హర్యానా డీఎస్పీ అయిన వికాస్ అర్జున అవార్డు గ్రహీత. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న వికాస్.. ఈ సారి కూడా నిరాశగానే ఇంటిబాటపట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications