Tokyo Olympics: అంచనాలకు మించి ఖర్చు.. జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?!!


హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద మెగా ఈవెంట్ 'ఒలింపిక్స్'. ఎన్నో ఆటలు ఇందులో భాగంగా జరుగుతాయి. ఇందుకోసం వేళ సంఖ్యలో విదేశాల నుంచి క్రీడాకారులు వస్తుంటారు. టోర్నీ నిర్వహణ, ప్లేయర్స్ బసకు అయ్యే ఖర్చు ఇలా ఎన్నో ఉంటాయి. అందుకే ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఒక్కోసారి తడిసి మోపెడవుతుంది. నిర్వహణ హక్కుల కోసం అన్ని దేశాలు పోటీ పడినా.. గేమ్స్ అనంతరం ధనిక దేశాలు కూడా అప్పుల పాలవుతాయి.
శుక్రవారం (జూన్ 23) ప్రారంభం అయిన టోక్యో ఒలింపిక్స్.. గేమ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోనున్నాయి. గేమ్స్ నిర్వహించడానికి మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి అయిన ఖర్చుతో పాటు గతేడాది కరోనా మహమ్మారి కారణంగా విశ్వ క్రీడలు వాయిదా పడటం, ప్రేక్షకులకు అనుమతి లేకపోవడం వంటి కారణాలతో టోక్యో ఒలింపిక్స్ ఖర్చు భారీగా పెరిగిపోయింది.

భారీ ఖర్చు
ఒలింపిక్స్ కోసం జపాన్ ప్రభుత్వం 2013లోనే బిడ్ వేసి గెలిచింది. అప్పుడు గేమ్స్ నిర్వహణ కోసం 730 కోట్ల డాలర్లు (సుమారు రూ.54 వేల కోట్లు) ఖర్చవుతాయని అంచనా వేశారు. బిడ్ దాఖలు చేయడానికే 10 కోట్ల డాలర్లు ఖర్చయింది. అదికాక గతేడాది గేమ్స్‌ను వాయిదా వేయడానికి ముందు ఒలింపిక్స్ నిర్వహణ కోసం 1260 కోట్ల డాలర్లు (సుమారు రూ.93 వేల కోట్లు) ఖర్చవుతాయని సవరించిన అంచనాలను జపాన్ విడుదల చేసింది. అయితే గేమ్స్ వాయిదా పడటం వల్ల జపాన్‌కు అదనంగా 280 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు మొత్తంగా ఖర్చు 3300 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.45 లక్షల కోట్లు)గా ఉండొచ్చని అంచనా.

ప్రేక్షకులు లేకుండానే
నిజానికి ఏ క్రీడకైనా.. ప్రేక్షకులు ఉంటేనే ఆదాయం. ఇందుకు ఒలింపిక్స్ మినహాయింపు ఏం కాదు. ఒకవేళ విశ్వ క్రీడలకు ప్రేక్షకులను అనుమతించి ఉంటే 80 కోట్ల డాలర్లు (సుమారు రూ.6 వేల కోట్లు) వచ్చేవి. కానీ కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే గేమ్స్ నిర్వహిస్తుండటంతో ఆ మొత్తం నిర్వాహకులు నష్టపోయినట్లే. ఇక గేమ్స్ కోసం వివిధ ప్రదేశాల్లో జపాన్‌కు చెందిన 60 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 300 కోట్ల డాలర్లు వస్తాయి. ఇతర స్పాన్సర్లు మరో 20 కోట్ల డాలర్లు ఇస్తున్నారు. టీవీ హక్కులు, స్పాన్సర్‌షిప్స్, ఆతిథ్య రంగాలన్నీ కలిపి మరో 200 కోట్ల డాలర్లు కూడా వచ్చాయి.
Tokyo Olympics 2021: నిరాశపరిచిన భారత ఆర్చర్లు.. ప్రవీణ్ జాదవ్‌దే బెస్ట్ ర్యాంక్!!

1984 గేమ్స్ తప్ప
ఇక ఒలింపిక్స్ వాటిని నిర్వహించే కమిటీలకు లాభాలు తెచ్చిపెట్టాయి తప్ప.. ఆతిథ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మాత్రం అతలాకుతలం చేశాయి. ఒక్క 1984 లాస్ ఏంజిల్స్ గేమ్స్ మాత్రమే అమెరికాకు లాభాలు తెచ్చి పెట్టాయి. రియో, సోచి, ఏథెన్స్, మోంట్రియాల్ నగరాలు గేమ్స్ నిర్వహించినప్పుడు ఆయా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇప్పుడు జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఈసారి భారీ ఖర్చు కూడా భయాందోళనలకు గురిచేస్తోంది.

యెన్ విలువ పతనమవడంతో
అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే జపాన్ కరెన్సీ 'యెన్' విలువ పతనమవడంతో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. నేషనల్ స్టేడియం, జిమ్నాస్టిక్స్ వేదికను రెనోవేట్ చేయడం కోసం చేసిన దిగుమతులకు అంచనాలకు మించి ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చయింది. దీనికితోడు లేబర్ కొరత కూడా ఈ ఖర్చులు పెరిగిపోవడానికి మరో కారణమైంది. కరోనా కారణంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి జపాన్‌కు అదనంగా 90 కోట్ల డాలర్ల ఖర్చయింది. ఇప్పుడు గేమ్స్ తర్వాత అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణ కూడా ఆ దేశానికి భారం కానుంది. పక్ష్యం రోజుల తర్వాత అసలు పరిస్థితి తేలనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications