
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా.. మెడల్ వస్తుందని భరోసా ఉంచగలిగే ఈవెంట్ షూటింగ్.. వ్యక్తిగత ఈవెంట్స్‌లో తొలి గోల్డ్ ఈ ఆటలోనే వచ్చింది. లెజండరీ షూటర్ అభినవ్ బింద్రా 2008 ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు 2004 గేమ్స్‌లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సిల్వర్ సాధించాడు. ఇక 2012 లండన్ గేమ్స్‌లో విజయ్ కుమార్ సిల్వర్, హైదరాబాదీ గగన్ నారంగ్ బ్రాంజ్ మెడల్ నెగ్గి డబుల్ కిక్ ఇచ్చారు.
కానీ, రియో గేమ్స్‌లో మన షూటింగ్ టీమ్ తీవ్ర నిరాశ పరిచింది. గోల్డ్ అనుకుంటే కనీసం బ్రాంజ్ కూడా రాలేదు. దాంతో టోక్యో గేమ్స్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టే యంగ్ షూటర్లు వరల్డ్ ఈవెంట్లలో సూపర్బ్ పెర్ఫామెన్స్ చేస్తుండటంతో వారిపై భారీ అంచనాలున్నాయి. మొత్తంగా ఎవరికి వారే సాటి అనేలా ఉన్న 15 మంది షూటర్లు ఇప్పటికే టోక్యో చేరుకున్నారు. రెండేళ్లుగా భారత షూటర్లు ఇంటర్నేషనల్ ఈవెంట్లలో అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ పిస్టల్ కేటగిరీలో సౌరభ్ చౌదరి, మనుభాకర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.
వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో వీళ్లు హాట్ ఫేవరెట్స్. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లలో ఎలవెనిల్ వలావిరన్ వరల్డ్ నంబర్ వన్‌గా ఉండగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో అభిషేక్ వర్మ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దివ్యాన్ష్ సింగ్, యశస్విని(10 మీటర్ల ఎయిర్ పిస్టల్)కూడా వరల్డ్ షూటింగ్‌తో తమదైన ముద్ర వేశారు. ఇక, సీనియర్లు సర్నోబత్(25 మీటర్ల పిస్టల్) అపూర్వి(10 మీటర్ల ఎయిర్ పిస్టల్) కూడా మెడల్ తెచ్చే సత్తా ఉన్నవాళ్లే. మొత్తంగా మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో ఇద్దరు టాప్ షూటర్లు 15 ఈవెంట్లు ఉంటే పది ఈవెంట్లలో పోటీ పడడం వల్ల భారత షూటర్ల నుంచి ఈ సారి బెస్ట్ రిజల్ట్ ఆశించొచ్చు.