
టెన్నిస్
ఫెన్సింగ్‌లో భారత స్టార్ క్రీడాకారిణి భవానీ దేవి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. తొలి రౌండ్లో ట్యునీషియా ప్లేయర్ నడియా బెన్ అజిజిపై 15-3 తేడాతో విజయం సాధించింది. అయితే ప్రపంచ మూడో ర్యాంకర్, రియో సెమీఫైనలిస్టు మేనన్ బ్రూనెట్ (ఫ్రాన్స్)తో రెండో రౌండ్లో ఓటమి పాలైంది. 7-15తో నిష్క్రమించింది. టెన్నిస్‌లో పురుషుల రెండో రౌండ్లో సుమిత్ నగాల్ ఓటమి పాలయ్యాడు. రష్యా ఆటగాడు మెద్వెదేవ్ డేనిల్ 6-2, 6-2 తేడాతో వరుసగా సెట్లలో ఓడించాడు.

ఆర్చరీ, షూటింగ్
పురుషల ఆర్చరీ జట్టు క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌తో కూడిన జట్టు ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. అయితే క్వార్టర్స్‌లో మాత్రం నిరాశపరిచింది. కొరియాతో 0-6 తేడాతో ఓటమి పాలైంది. ఈ పోటీలో భారత క్రీడాకారులు ఏమాత్రం పోరాట పటిమ చూపలేదు. వరుసగా మూడు సెట్లలో పరాజయం పాలయ్యారు. షూటింగ్‌లోనూ బుధవారం నిరాశే ఎదురైంది. పురుషుల స్కీట్ షాట్‌గన్ పోటీల్లో మనోళ్లు పేలవ ప్రదర్శన చేశారు. అంగద్‌వీర్ సింగ్ భజ్వా వరుసగా ఐదు రౌండ్లలో 24, 25, 24, 23, 24 స్కోరు చేశాడు. 120 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. ఇక మిరాజ్ అహ్మద్ ఖాన్ వరుసగా 25, 24, 22, 23, 23తో మొత్తం 117 పాయింట్లే చేసి 25వ స్థానంలో నిలిచాడు. తొలి ఆరు స్థానాల్లో నిలవకపోవడంతో ఫైనల్‌కు అర్హత పొందలేదు.
Mirabai Chanu:స్వదేశం చేరుకున్న మీరాబాయి చాను.. విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్!!

సెయిలింగ్, బ్యాడ్మింటన్
సెయిలింగ్‌లో భారత క్రీడాకారులు ఆకట్టుకోలేదు. డింఘే లేజర్ రేస్-2లో శరవణన్ విష్ణు 20 రేస్ పాయింట్లతో 20వ స్థానంలో నిలిచాడు. రేస్-3లో 24 పాయింట్లతో 24వ స్థానానికి పరిమితం అయ్యాడు. మహిళల రేస్-4లో కుమనన్ నేత్ర 40 పాయింట్లతో 40వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు రేస్-3లో 15 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్-ఏ రెండో మ్యాచులో సాత్విక్, చిరాగ్ జోడీ పరాజయం పాలైంది. ఇండోనేసియా ద్వయం గిడేన్ మారక్కస్, కెవిన్ సంజయ చేతిలో 13-21, 12-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయారు.

టేబుల్ టెన్నిస్
టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. పోర్చుగీస్ ప్లేయర్ టియాగో పొలొనియాను 4-2 తేడాడో ఓడించాడు. 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. మహిళల వ్యక్తిగత రెండో రౌండ్లో సుతీర్థ ముఖర్జీ పోర్చుగీస్ అమ్మాయి ఫు యు చేతిలో 0-4 తేడాతో ఓటమిపాలైంది. వరుసగా 3-11, 3-11, 5-11, 5-11 తేడాతో ఓడిపోయింది. మూడో రౌండ్లో మనిక బత్రా 0-4 తేడాతో పొల్కనోవా సోఫియా (ఆస్ట్రియా) చేతిలో ఓడింది. వరుసగా 8-11, 2-11, 5-11, 7-11 స్కోర్ చేసింది. బాక్సింగ్ పురుషుల మిడిల్ (69-75కిలోల) విభాగంలో ఆశీశ్ కుమార్ 0-5 తేడాతో ఓడిపోయాడు.


Click it and Unblock the Notifications












