Tokyo Olympics 2021: లైవ్‌లోనే ప్లేయర్‌కు ప్రపోజ్ చేసిన కోచ్.. ఏడ్చేసిన అందాల సుందరి (వీడియో)!

టోక్యో: ఇటీవలి కాలంలో బహిరంగంగానే ప్రపోజ్ చేసుకోవడం కామన్ అయిపొయింది. ముఖ్యంగా సెలెబ్రిటీలు. ఇక క్రీడాకారులు అయితే మైదానంలోనే ప్రపోజ్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మద్యే ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మైదానంలోనే ప్రపోజ్ చేయగా.. అమెరికన్ ఫుట్‌బాలర్ హసానీ డాట్సన్ స్టీఫెన్‌సన్ తన ప్రియురాలికి గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేశాడు. తాజాగా ఇలాంటి ఘటనే టోక్యో ఒలింపిక్స్ 2020లో చోటుచేసుకుంది. ఓ ఫెన్సింగ్ ప్లేయర్‌కు తన కోచ్ టీవీ కెమెరాల ముందే ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నన్ను పెళ్లి చేసుకుంటావా
అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యింది. గేమ్ అనంతరం తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె కోచ్ లుకాస్ ససిడో వెంట నిలబడి.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని వారి మాతృ భాషలో రాసిన ఒక ప్లకార్డు పట్టుకుని నిలబడ్డారు. వీటిని చూసిన మీడియా ప్రతినిధులు ముసిముసి నవ్వులు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియక మారియా బెలెన్ వెనకకు తిరిగి చూసింది. లైవ్‌లో తన కోచ్ చేసిన పని చూసి ఆశ్చర్యపోయింది.

11 ఏళ్ల క్రితమే
షాక్ నుంచి తేరుకున్న అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్.. తన కోచ్ లుకాస్ ససిడో వైపు అలా చూస్తూ ఉండిపోయింది. 'చాలా మంది మనల్ని చూస్తున్నారు.. ఓకే చెప్పు' అని కోచ్ మోకాలిపై కూర్చొని వేడుకున్నాడు. దీంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. నిజానికి కోచ్ లుకాస్ ససిడో ఇలా ప్రాధేయపడటం ఇదే తొలిసారి కాదు. 2010లోనూ పారిస్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ సందర్భంగా ఇలాగే కెమెరా ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. అప్పుడు మారియా బెలెన్ ఒప్పుకోలేదు. 'జోక్ చేస్తున్నావా' అంటూ లైట్ తీసుకోవడంతో అతడు నిరాశ చెందాడు.11 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపోస్ చేసి సక్సెస్ అయ్యాడు.
Mirabai Chanu: లాక్‌డౌన్ వల్లే ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా.. ఈసారి ఇంటివద్ద 10 రోజులే ఉంటా: మీరా

17 ఏళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో
ఫెన్సర్ మారియా బెలెన్, కోచ్ లుకాస్ ససిడో ఇద్దరూ 17 ఏళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండటం విశేషం. 36 ఏళ్ల బెలెన్ మూడుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. బెలెన్‌కు లుకాస్ చాలా కాలంగా కోచ్‌గా ఉన్నాడు. సాసెడోకు ఎస్ చెప్పిన తర్వాత మారియా బెలెన్ సంతోషం పట్టలేక బోరున ఏడ్చేసింది. అర్జెంటీనా వెళ్లిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఫెన్సర్ మారియా చెప్పింది. ఓడిన బెలెన్ త్వరలోనే అర్జెంటీనాకు పయనం కానుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు ఈ జంటకు 'ఆల్ ది బెస్ట్' చెపుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications