
అట్టలతో మంచం
కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రీడాకారులు శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను ఒలింపిక్స్ నిర్వాహకులు సిద్ధం చేశారు. క్రీడాగ్రామంలోని అథ్లెట్ల గదుల్లో అట్టలతో తయారు చేసిన మంచాలను వేశారు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఈ అట్టల్ని రీసైక్లింగ్ ద్వారా కాగితపు ఉత్పత్తులుగా మారుస్తారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండాలన్న ఉద్దేశంతో ఈ మంచాలను తయారు చేయించారు. ఒక్కో మంచం గరిష్టంగా 200 కిలోల బరువు ఆపేలా డిజైన్ చేసినట్లు నిర్వాహకులు ఇంతకుముందు ఓ ప్రకటనలో తెలిపారు.

మరొకరు చేరితే విరిగిపోతుంది
కరోనా ప్రభావంతో ఏడాది పాటు క్రీడలు వాయిదా పడటం వల్ల ఫర్నీచర్‌లో చాలా వరకు నిర్వాహకులు మార్పులు చేశారు. అంతకుముందు భారీ బరువుతో ఉన్న మంచాలను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు రీసైక్లింగ్‌కు వీలుండే, తేలికైన బెడ్లను అథ్లెట్ల కోసం అందుబాటులో ఉంచారు. వీటిని 'యాంటీ సెక్స్ బెడ్'గా అని పిలుస్తున్నారు. ఈ మంచంపై కేవలం ఒక్క అథ్లెట్ మాత్రమే నిద్రపోవడానికి వీలుంటుంది. మరొకరు చేరితే అది విరిగిపోతుంది. దీని వల్ల ఆటగాళ్లు శృంగారం చేయడానికి వీలుపడదు. వైరస్ కారణంగా ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వాహకులు కండోమ్స్ పంపిణీ నిలిపేసిన విషయం తెలిసిందే.
India vs Sri Lanka:సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాంటోడు.. పాండేను ఆడేసుకుంటున్న ఇండియన్ ఫాన్స్!

ఒలింపిక్స్ ముగిశాకే కండోమ్‌లు
క్రీడాకారుల కోసం దాదాపు లక్షా 60 వేల కండోమ్‌లు ఒలింపిక్స్ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అయితే వీటిని పోటీలు పూర్తయి, ఒలింపిక్ విలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అథ్లెట్లకు అందజేయనున్నారు. ఆ కండోమ్‌లతో తమ తమ దేశాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కల్పించాలని ప్లేయర్లకు సూచించారు. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు.. కరోనా నిబంధనలు అత్రికమించినా, భౌతిక దూరం పాటించకపోయినా వారిపై అనర్హత వేటు వేయడం, బహిష్కరించడం చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇప్పటికే హెచ్చరించింది.

తొలి విడతగా
ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల తొలి విడతగా ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్ కూడా శనివారం టోక్యో వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌కు భారత్ మొత్తం 228 సభ్యులను పంపిస్తోంది. ఇందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. భారత రోయింగ్, షూటింగ్ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
