40 బంతుల్లో 26 పరుగులే
భారీ లక్ష్యం ముందున్నా ఎలాంటి బెరుకు లేకుండా షాట్లు ఆడుతూ మనీష్ పాండే భారత జట్టుని గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇవన్ని గతంలో జరిగినవి. ప్రస్తుతం మనోడి పరిస్థితి పూర్తి బిన్నంగా మారింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ కీలక సమయంలో ఔట్ అవుతున్నాడు. ఐపీఎల్ 2021లో ఇదే జరిగింది. అయినా మనోడు మారలేదు.
శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కూడా మరోసారి నెమ్మదిన ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 26 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక బౌండరీ బాదాడు. ఒకవైపు పృథ్వీ షా, ఇషాన్ కిషన్ బిఓఉండర్లు బాడుతుంటే.. మనీష్ మాత్రం సింగిల్స్ తీయడానికే ఆపసోపాలు పడ్డాడు. దీంతో టీమిండియా ఫాన్స్ అతడిపై మండిపడుతున్నారు.

జూనియర్ ఆర్టిస్ట్ లాంటోడు
సోషల్ మీడియా వేదికగా మనీష్ పాండేపై మీమ్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మనీష్ పాండే.. జట్టులో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాంటోడు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఐపీఎల్ 2021 ఫామ్ కొనసాగిస్తున్నాడు' అని ఇంకొకరు ట్వీట్ చేశాడు. 'శిఖర్ ధావన్ సెంచరీ మిస్ చేశాడు', 'ఎందుకురా బాబు ఈ మనీష్', 'డేవిడ్ వార్నర్ చేసిన తప్పిదమే.. భారత్ చేస్తోంది' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అతని పర్ఫామెన్స్‌తో గుర్రుగా ఉన్న అభిమానులు పాండేకి ఎందుకు అవకాశం ఇచ్చారంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. పాండే స్థానంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు.
IND vs SL: సెంచరీ కొట్టాలనుకున్నా.. కానీ అక్కడ ఎక్కువ పరుగులు లేవు! పృథ్వీ, ఇషానే దంచేశారు: ధావన్

27 వన్డేలు, 39 టీ20లు:
ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో మనీష్ పాండే 44 బంతుల్లో 61 రన్స్ చేశాడు. కీలక సమయంలో ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ మ్యాచ్ ఓడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 38 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 7 బంతుల్లో రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దాంతో అతడు జట్టులో చోటు కోల్పాయాడు. అయినా కూడా మనీష్ బ్యాటింగ్‌లో వేగం పెంచడం లేదు. మనీష్ భారత్ తరఫున 27 వన్డేలు, 39 టీ20లు ఆడాడు.
పృథ్వీ, ఇషాన్ మెరుపులు:
ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1x6) మంచి ఆరంభం ఇచ్చారు. ఆపై వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8x4, 2x6), మనీశ్ పాండే (26; 40 బంతుల్లో 1x4, 1x6), సూర్యకుమార్ యాదవ్ (31; 20 బంతుల్లో 5x4) ధాటిగా ఆడి సునాయాస విజయాన్ని అందించారు. దాంతో భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో బోణి కొట్టింది. ఇక రెండో వన్డే మంగళవారం ఇదే మైదానంలో జరగనుంది.


Click it and Unblock the Notifications












