
సంప్రదాయంగా..
ఒలింపిక్స్ పుట్టినిల్లు ఒలింపియా నుంచి టోక్యో ఒలింపిక్ జ్యోతి గురువారం తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పురాతన పుజారి వేషంలో ఉన్న గ్రీకు నటి.. సంప్రదాయబద్దంగా సూర్యకిరణాలను కాన్‌కేవ్ మిర్రర్‌పై ప్రసరింపజేసి పుట్టించిన వేడి నుంచి కాగడను ముట్టించింది. దానిని రియో ఒలింపిక్స్ షూటింగ్‌లో గ్రీస్‌కు గోల్డ్ మెడల్ సాధించిపెట్టిన అన్నా కొరాకైకు అందించింది. వరల్డ్‌లో ఇలా టార్చ్ అందుకున్న తొలి మహిళగా కొరాకై చరిత్రకెక్కింది. అనంతరం కొరాకై.. ఆ టార్చ్ సాయంతో మిజుకి నొగౌచి చేతిలో ఉన్న టార్చ్‌ను వెలిగించింది. ఇలా వెలిగించడాన్ని టార్చ్ కిస్ అంటారు. దీంతో టార్చ్ రిలే అధికారికంగా మొదలైంది.

కరోనా దెబ్బకు.. సాదాసీదాగా..
ఈ జ్యోతి వారం రోజుల పాటు గ్రీసు దేశంలోని 37 నగరాలు, 15 చారిత్రక ప్రదేశాల మీదుగా... దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అనంతరం ఈ నెల 19న జపాన్‌లోని ఫుకుషిమాకు చేరుతుంది. అక్కడి నుంచి ఒలింపిక్స్ జరిగే టోక్యోకు చేరుతుంది. అట్టహాసంగా జరగాల్సిన ఈ జ్యోతి ప్రజ్వలన ప్రారంభ వేడుకలను కరోనా దెబ్బతో ప్రేక్షకుల్లేకుండా నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జపాన్ ఆర్గనైజర్స్, జర్నలిస్ట్‌లు అంతా కలిపి ఓ 100 మందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టార్చ్ చరిత్ర
గ్రీకులకు ఆరాధ్యదైవమైన జ్యూస్ నుంచి ప్రొమెథెస్ నిప్పును దొంగిలించాడని వారి నమ్మకం. ఆ సంఘటన జ్ఞాపకార్థం ఒలింపిక్స్ గేమ్స్ జరిగే ఒలింపియా స్టేడియం ముందు జ్యోతిని వెలిగించేవారు. ఆ సంప్రదాయం ఆధునిక ఒలింపిక్ క్రీడల్లో కూడా కనిపిస్తుంది. 1928 ఒలింపిక్ క్రీడల్లో తొలిసారిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు. 1936 బెర్లిన్ గేమ్స్ నుంచి టార్చ్ ర్యాలీని కూడా ఓ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఒలింపిక్ క్రీడలు పుట్టిన చోటు ఏథెన్స్ నుంచి ఆతిథ్య దేశం వరకు ఒలింపిక్ టార్చ్‌ర్యాలీ కొనసాగుతుంది. టార్చ్ రిలే ఆలోచనకు బీజం పోసింది జర్మనీకి చెందిన కార్ల్ డీమ్. బెర్లిన్‌లో 1936లో జరిగిన ఒలింపిక్స్‌కు ఆయన చీఫ్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications
