Tokyo 2020: స్విమ్మర్ సజన్ ప్రకాశ్ విఫలం!

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైనే మీరాబాయి చాను రజత పతకంతో భారత్ బోణీ కొట్టగా... రెండో రోజు తీవ్ర నిరాశే ఎదురైంది. ఒక్క మెడల్ కూడా రాలేదు. సోమవారం కూడా భారత అథ్లెట్లు నిరాశనే మిగులుస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్లలో ప్రతికూలత ఫలితాలే ఎదురయ్యాయి. భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు.
సోమవారం జరిగిన పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈ వెంటన్‌లో సజన్ ప్రకాశ్ 24వ స్థానంలో నిలిచాడు. హీట్-2లో 1 నిమిషం 57.22 సెకండ్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచిన సజన్ ప్రకాశ్ ఓవరాల్‌గా 24వ స్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
ఇక ఆదివారం శ్రీహరి నటరాజ్, మానా పటేల్ కూడా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హీట్‌ను 54.31 సెకండ్లలో పూర్తి చేసిన నటరాజ్ 27వ స్థానంలో నిలిచాడు. మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్‌ను మానా పటేల్ ఒక నిమిషం 05.20 సెకన్లలో పూర్తి చేసి 39వ ప్లేస్‌తో సరిపెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications