
అదితి అశోక్..
అనూహ్యంగా ఆశలు రేకెత్తించిన భారత గోల్ఫర్ అదితి అశోక్.. వెంట్రుకవాసిలో పతకాన్ని కోల్పోయింది. నాలుగో స్థానంలో నిలిచి చేతికి అందేంత దూరంలో తన జైత్రయాత్రను ముగించాల్సి వచ్చింది. నిన్నటి పొజిషన్‌లో(మూడో రౌండ్) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఇవాళ్టి వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్‌లో జరిగిన ఫైనల్ గేమ్ రసవత్తరంగా నడిచింది. అయినా అదితి అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్ పొజిషన్‌లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం-ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది.

బజరంగ్ పూనియా..
భారత స్టార్ రెజ్లర్.. బజరంగ్ పునియా అంచనాలకు మించి రాణించాడు. తన సత్తాను చాటాడు. మోకాలి నొప్పితో బాధపడుతూనే రింగ్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. దేశానికి కాంస్య పతకాన్ని అందించాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఘన విజయం సాధించాడు. కజకిస్తాన్‌కు చెందిన దౌలెట్ నియాజ్‌బెకొవ్‌పై ఏకపక్షంగా విజయ ఢంకా మోగించాడు. 8-0 స్కోర్ తేడాతో అతనిపై గెలిచాడు. 2019లో వివాదాస్పదంగా తనపై సాధించిన విజయానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు బజరంగ్. ఏ దశలోనూ తన ప్రత్యర్థిని పైచేయి సాధించడానికి అవకాశం ఇవ్వలేదు.

నీరజ్ చోప్రా..
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఫలితంగా 100 ఏళ్ల కళను సాకారం చేస్తూ అథ్లెటిక్స్‌లో మెడల్ అందించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన రెండో భారత్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. నీరజ్ చోప్రా కన్నా ముందు షూటింగ్‌లో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక తొలి ప్రయత్నంలోనే ఈటెను 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లతో మరింత మెరుగైన స్థానంలో నిలిచాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ రికార్డు. ఇక మూడో ప్రయత్నంలో 76.99 దూరమే విసిరిన నీరజ్ చోప్రా... నాలుగు, ఐదో ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. చివరి ప్రయత్నంలో 84.24 మీటర్లు విసిరాడు.


Click it and Unblock the Notifications












