For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టోక్యో వీరులకు కేంద్ర మంత్రుల ఘన సన్మానం.!

Tokyo 2020: Neeraj Chopra, Other Medallists Honoured After Grand Welcome

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ శర్మతో పాటు ఇతర క్రీడా మంత్రులు కిరణ్ రిజిజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఇతర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రమే స్వదేశం చేరిన భారత హీరోలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. క్రీడాకారుల కుటుంబసభ్యులు, క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయింది. భారత్‌ మాతా కీ జై.. నినాదాలు మార్మోగాయి. మెడల్ విన్నర్స్ నీరజ్ చోప్రా, రవి దహియా, బజరంగ్ పూనియా, లోవ్లినా బోర్గోహైన్ తోపాటు పురుష, మహిళా హాకీ క్రీడాకారులతో సుమారు 80 మంది గల బృందం భారత్ చేరింది. గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సెల్ఫీ తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు.

నీరజ్‌కు చుర్మా తినిపించిన తల్లి

నీరజ్ చోప్రా తల్లి సరోజాదేవి తన కొడుకును చూసేందుకు చాలా సేపటి నుంచి ఎదురుచూస్తూ కూర్చున్నది. నీరజ్ విమానం దిగి రాగానే వెంటనే అతడిని కౌగిలించుని ఆశీర్వాదం అందజేసింది. ఎయిర్‌పోర్టులోనే కొడుకుకు ఎంతో ఇష్టమైన చుర్మా తినిపించింది. నీరజ్ సోదరి సంగీత సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. సోదరుడిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరించింది. నీరజ్ తండ్రి కూడా చాలా సంతోషంగా కనిపించారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు నీరజ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వారితో సెల్ఫీలు దిగారు.

క్రీడాకారులకు కరోనా పరీక్షలు

విమానాశ్రయంలోనే క్రీడాకారులకు ఆర్టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి హోటల్‌ అశోకాకు బయల్దేరి వెళ్లారు. హోటల్‌ అశోకా వద్ద భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌, క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు క్రీడాకారులకు ఘనంగా స్వాగతించి పతకాలు గెలిచిన అథ్లెట్లను సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, మాజీ క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు భావోద్వేగానికి గురయ్యారు. మెడల్ విన్నర్స్ అందరికి ధన్యవాదాలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ విజయాలతో యావత్ దేశం సంబురం చేసుకుందన్నారు. ఇక సింధుకు ఐస్ క్రీమ్, నీరజ్ చోప్రాకు చపాతి చుర్మా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తినిపిస్తానని కేంద్రమంత్రి అనురాగ్ శర్మ మాట ఇచ్చారు. పతక విజేతలైన నీరజ్ చోప్రా, లవ్లీనా, రవి దహియా, బజరంగ్ పూనియాలతో భారత హకీ పురుషులు, మహిళల టీమ్‌లను ఘనంగా సన్మానించారు. మహిళల టీమ్ పతకం తేకపోయినా వారి పోరాటం అద్భుతమని కొనియాడారు.

కేక్ కట్ చేసి హాకీ టీమ్ సంబరాలు

అంతకు ముందు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు అశోక హోటల్‌లో వేడుకలు జరుపుకున్నాయి. హోటల్‌లో ఇరు జట్లు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, మహిళల హాకీ జట్టు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నది. కాంస్య పతక పోరులో బ్రిటన్ చేతిలో 4-3తో ఓడిపోయింది. కాగా, పతకం గెలిచిన మరునాడు మీరాబాయి చాను, పీవీ సింధూలు భారతదేశానికి చేరుకున్నారు.

Story first published: Monday, August 9, 2021, 21:14 [IST]
Other articles published on Aug 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+