Tokyo 2020: చరిత్ర సృష్టించిన జమైకన్ పరుగుల చిరుత, అమెరికా స్విమ్మర్!

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మరో వరల్డ్ రికార్డు నమోదైంది. మహిళల 100 మీటర్ల మారథాన్‌లో జమైకా అథ్లెట్ ఎలెన్ థామ్సన్ రికార్డు సృష్టించింది. కేవలం 10.61 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒలింపిక్స్ క్రీడల్లో ముఖ్యంగా మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో అతితక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకున్న రెండో అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. ఎలెన్ కన్నా ముందు 1988 ఒలింపిక్స్‌లో గ్రిఫిన్ జాయ్‌నెర్ 10.49 సెకన్ల 100 మీటర్ల పరుగు పందేన్ని పూర్తి చేసి ఈ జాబితాలో టాప్‌లో ఉంది.
ఇక థామ్సన్ తర్వాతి స్థానంలో రెండుసార్లు చాంపియన్ అయిన షెల్లీ అన్నా ఫ్రాసెర్‌ను 10.74 సెకన్లతో గమ్యాన్ని చేరుకుని రజతాన్ని, షెరికా జాక్సన్ 10.76 సెకన్లతో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్ విభాగంలో అమెరికా స్విమ్మర్ కేటీ లెడిక్కీ శనివారం కొత్త చరిత్ర సృష్టించింది. ఆమె ఒలింపిక్స్ కెరీర్‌లో వ్యక్తిగతంగా మొత్తం 8 బంగారు పతకాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ రోజు టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈత పోటీల్లో కేటీ లేడిక్కి టాప్‌లో నిలిచి ఈ ఒలింపిక్స్‌లో రెండో బంగారు పతకం సాధించింది. అంతకుముందు 1500 మీటర్ల విభాగంలోనూ మరో గోల్డ్ తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఆస్ట్రేలియాకు చెందిన అరియర్న్ టిట్మస్ ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలవగా.. ఇటలీ స్విమ్మర్ సిమోనా క్వాడరెల్లా బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. లెడిక్కీ 1500 మీటర్లలోనూ టిట్మస్‌ను ఓడించి బంగారు పతకం సాధించడం గమనార్హం. అలాగే ఈ ఒలింపిక్స్‌లో ఈ అమెరికా స్విమ్మర్ మరో రెండు వెండి పతకాలు కూడా సొంతం చేసుకుంది. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. అప్పుడు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించగా ఒక వెండి పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications