Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tokyo 2020: ప్చ్.. భారత మహిళల హాకీ టీమ్ చెత్తాట.. జర్మనీ చేతిలో చిత్తు!

Tokyo 2020: India lose 0-2 against Germany in womens hockey

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ నెదర్లాండ్స్ చేతిలో చిత్తయిన రాణీరాంపాల్ నేతృత్వంలో భారత జట్టు తాజాగా జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. పూల్-ఏలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-2తో రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ జర్మనీ చేతిలో ఖంగుతిన్నది.
జర్మనీ తరఫున ఆ జట్టు కెప్టెన్ నైక్ లోరెంజ్(12వ నిమిషం), అన్నా స్క్రోడర్(35వ నిమిషం) గోల్స్ చేశారు. ఇక జర్మనీకి ఇది రెండో విజయం కాగా.. తొలి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 2-1తో ఓడించింది.

ఆట ప్రారంభమైన 12వ నిమిషంలో నైక్ లోరెంజ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి జర్మీనీకి ఆధిక్యం అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఫస్ట్ క్వార్టర్ 1-0తో ముగిసింది. ఇక సెకండ్ క్వార్టర్‌లో మరింత చెలరేగిన జర్మనీ అన్నా స్క్రోడర్ గోల్‌తో ఆధిక్యాన్ని డబుల్ చేసుకుంది. అనంతరం భారత్ చేసిన గోల్ ప్రయత్నాలను జర్మనీ అడ్డుకుంది. రాణి రాంపాల్ సేనకు అదృష్టం కూడా కలిసి రాలేదు. గోల్ చేయడానికి వచ్చిన అవకాశాలను భారత ఆటగాళ్లు వృథా చేశారు. దాంతో ఫస్టాఫ్ 2-0తో ముగిసింది.

సెకండాఫ్‌లో భారత మహిళలకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుజ్రీత్ కౌర్ వృథా చేసింది. జర్మనీ ఆటగాళ్లు బంతిని మొత్తం తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ భారత మహిళలపై ఒత్తిడికి గురి చేశారు. మరోవైపు భారత డిఫెండర్లు ప్రతిఘటించడంతో గోల్స్ నమోదు కాలేదు. దాంతో జర్మీన విజయం ఖాయమైంది. భారత మహిళల హాకీ టీమ్ బుధవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్‌కు ముందు జూలై 30న ఐర్లాండ్, జూలై 31న సౌతాఫ్రికాతో తలపడనుంది.

Story first published: Monday, July 26, 2021, 19:48 [IST]
Other articles published on Jul 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+