Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాంగ్ జంప్‌లో ఒలింపిక్స్ రికార్డు బ్రేక్ చేసిన ఇండియన్ అథ్లెట్!

Tamil Nadus Jeswin Aldrin sets new National Record in men’s long jump at Indian Open

న్యూఢిల్లీ: ఇండియన్ ఓపెన్ జంప్స్‌ 2023 పోటీల్లో తమిళనాడు లాంగ్ జంపర్ జెస్విన్ అల్డ్రీన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కర్ణాటకలోని బళ్లారి వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో అల్డ్రీన్ 8.42 మీటర్ల దూరం దూకి నేషనల్‌తో పాటు వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. తొలి ప్రయత్నంలో 8.05 మీటర్లు, రెండో ప్రయత్నంలో 8.26 మీటర్లు దూకిన జెస్విన్ ఆల్డ్రీన్, మూడో ప్రయత్నంలో 8.42 మీటర్లు దూకాడు. ఇది ఆసియా చరిత్రలో ఐదో రికార్డు కాగా వరల్డ్ లాడర్‌లోనూ చోటు దక్కించుకుంది.

అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్ పోటీల్లో స్వర్ణం సాధించిన గ్రీకు లాంగ్ జంపర్ మిల్టీయాదిస్ టంటోగ్లో రికార్డును కూడా జెస్విన్ అధిగమించాడు. ఒలింపిక్స్‌లో గ్రీకు లాంగ్ జంపర్.. 8.41 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. ఈ ఘనతను తమిళనాడు లాంగ్ జంపర్ 8.42 మీటర్లతో అధిగమించాడు.

2019 తర్వాత 8.40 మీటర్లు అందుకున్న మొట్టమొదటి ఆసియా అథ్లెట్‌గా జెస్విన్ అల్డ్రీన్ గుర్తింపు పొందాడు. గత మూడేళ్లలో 8.40+ మీటర్ల దూరాన్ని దూకిన ఐదో అథ్లెట్‌గా కూడా నిలిచాడు. 7.85 మీటర్లు దూకిన మహ్మద్ యెహియా సిల్వర్ మెడల్ దక్కగా.. 7.77 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచిన రిషభ్ రిషీశ్వర్ బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.

ఇక గతేడాదే నేషనల్ రికార్డు బ్రేక్ చేయాలని అనుకున్నానని జెస్విన్ తెలిపాడు. అప్పుడు సాధ్యం కాకపోవడంతో మరింత కసిగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు అధిగమించానని తెలిపాడు. ఈ ఘనతను అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

2022 ఫెడరేషన్ కప్ ఈవెంట్‌లో 8.36 మీటర్లు దూకిన మురళీ శ్రీశంకర్, లాంగ్‌ జంప్ ఈవెంట్స్‌లో నేషనల్ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును +0.5 మీటర్ల తేడాతో జెస్విన్ అల్డ్రీన్ బ్రేక్ చేశాడు. కజకిస్థాన్‌లో జరిగిన 2023 ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 7.97 మీటర్లు దూకి రజతం గెలిచిన జెస్విన్ అల్డ్రీన్, ఆ తర్వాత వరుసగా విఫలమై కామన్వెల్త్ గేమ్స్‌ 2022 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Story first published: Friday, March 3, 2023, 18:21 [IST]
Other articles published on Mar 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+