కామెన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్.. భారీ నజరానా ప్రకటించిన సీఎం విజయ్!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ రాజా ముత్తుపాండికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి 286(126+160) కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
ఈ ప్రదర్శనతో రాష్ట్రం గర్వించేలా చేసిన రాజా ముత్తుపాండికి రూ. 30 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందిస్తున్నట్లు తమిళనాడు సీఎం దళపతి విజయ్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

'కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరిలో సిల్వర్ మెడల్ గెలిచిన రాజా ముత్తుపాండికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన సాధించిన ఈ విజయం తమిళనాడుకు ఎంతో గర్వకారణం. ఈ గెలుపు రాష్ట్ర యువతకు స్ఫూర్తిగా నిలవాలి. రాజా ముత్తుపాండి భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.' అని సీఎం విజయ్ ట్వీట్ చేశారు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రాజా ముత్తుపాండి పురుషుల 65 కిలోల విభాగంలో భారత్ తరఫున పోటీపడ్డాడు. ఆదివారం జరిగిన ఈ పోటిల్లో స్నాచ్ విభాగంలో రాజా ముత్తు పాండి తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో మాత్రం క్లియర్ చేశాడు. మూడో ప్రయత్నంలో 129 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన రాజా ముత్తుపాండి.. ఆ తర్వాత పుంజుకుని రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తాడు. దాంతో మొత్తం 286 కిలోల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్ నాలుగు పతకాలను గెలుచుకుంది. పారా పవర్ లిఫ్టింగ్‌లో జాండు కుమార్ కాంస్య పతకంతో తొలి మెడల్ అందించగా.. పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను బంగారు పతకం గెలిచింది. పురుషుల 65 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో రాజా ముత్తుపాండి సిల్వర్ మెడల్ సాధించాడు. బాక్సింగ్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

