For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీడెన్‌లో శృంగార క్రీడలు.. జూన్ 8 నుంచి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్!

న్యూఢిల్లీ: నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసుకునే శృంగారాన్ని స్వీడెన్ దేశం ఓ క్రీడగా ప్రకటించింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారత్‌తో పాటు చాలా దేశాల్లో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది ఇబ్బందిపడతారు.

అలాంటిది స్వీడెన్ దేశం యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ పేరిట ఓ టోర్నీని నిర్వహించబోతుంది. జూన్ 8 నుంచి ఈ టోర్నీ ప్రారంభం అవుతుందని స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ వెల్లడించింది. కొన్ని వారాల పాటు జరిగే ఈ రతి క్రీడలో పాల్గొనేవాళ్లు ప్రతీ రోజు 6 గంటల పాటు శృంగారం చేయాల్సి ఉంటుంది.

Sweden Declares SEX As A Sport, European Sex Championship Starts June 8th.

ముద్దులు, కౌగిలింతలతో పాటు ఫోర్ ప్లే నుంచి కామ సూత్రలోని శృంగార భంగిమలన్నిటిని వివిధ భాగాల్లో రౌండ్ల వారీగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ప్రతీ జంట 45 నిమిషాల నుంచి గంట వరకూ రతి క్రీడలో మునిగి తేలాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 20 జంటలు ఈ ఛాంపియన్‌షిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు.

ఈ పోటీలను ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముగ్గురు జడ్జీలతో కూడిన జ్యూరీ శృంగారంలో పాల్గొనే జంటను తీక్షణంగా గమనించి విజేతను ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే జంటలు నిర్వాహకులు చెప్పిన 16 నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తన భాగస్వామిని సెక్స్‌కు ప్రేరిపితం చేసే దగ్గర్నుంచి ఓరల్ సెక్స్, బాడీ మసాజ్, వివిధ భంగిమలు, భావప్రాప్తి వరకు అన్నింటిని పరిగణలోకి తీసుకుంటారు.

ఈ టోర్నీలో భార్య భర్తలే కాకుండా.. ప్రేమికులు, స్వలింగ సంపర్కులు కూడా పాల్గొనేందుకు నిర్వాహకులు అనుమతించారు. యూరోపియన్ దేశాల్లో శృంగారం గురించి అవగాహన కలిగించేందుకే తాము ఈ టోర్నీ నిర్వహిస్తున్నామని స్వీడెన్ సెక్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. శృంగారం గురించి ఉన్న అపోహలు, భయాలు పొగొట్టేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.

'సెక్స్ అనేది ప్రతీ ఒక్కరు ఆడాల్సిన క్రీడ. శృంగారం చేసేటప్పుడు మానసికంగా, శారీరకంగా లీనం అవుతారు. అయితే అన్ని క్రీడల్లో లాగే ఈ ఆటకు కూడా శిక్షణ అవసరం. అందుకే ఈ సెక్స్ ఛాంపియన్‌షిప్ వారికి ఓ ప్రాక్టీకల్ బుక్‌గా మారుతుందని ఆశిస్తున్నాం.'అని స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డ్రాగన్ బ్రాటిచ్ తెలిపారు.

అయితే ఈ టోర్నీ వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇది జనాల్లో విచ్ఛలవిడి తనాన్ని, విశృంఖల శృంగారాన్ని పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Story first published: Saturday, June 3, 2023, 16:26 [IST]
Other articles published on Jun 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+