Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలంగాణ బిడ్డ సంచలన విజయం

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజ సంచలన ప్రదర్శన‌తో ఆకట్టుకుంది. టేబుల్ టెన్నిస్ వరల్డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్‌ను ఓడించింది. మరో భారత ప్లేయర్ ఐహిక ముఖర్జీ సైతం సంచలన విజయాన్ని అందుకుంది. చైనాకే చెందిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్‌ను ఓడించింది.

అయితే సీనియర్ ప్లేయర్ అయిన మనిక బాత్రా తన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓడిపోవడం.. నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో ఐహిక కూడా పరాజయం పాలవడంతో భారత్‌‌కు ఓటమి తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చైనా 3-2‌తో భారత్‌పై విజయం సాధించింది.

Sreeja Akula and Ayhika Mukherjee score stunning wins over Chinese World No 1 and No 2

తొలి సింగిల్స్ 155వ ర్యాంకర్ ఐహిక 12-10, 2-11, 13-11, 11-6‌తో వరల్డ్ నంబర్ వన్ సుస్ యింగ్షాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో నంబర్ వన్ ర్యాంకర్‌‌ను ఓడించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. వరల్డ్ టీమ్ టోర్నీలో సున్‌కు ఇదే తొలి పరాజయం కావడం విశేషం.

మూడో సింగిల్స్‌లో శ్రీజ 11-7, 11-9, 13-11తో రెండో ర్యాంకర్ వాంగ్ యిదిపై విజయం సాధించింది. కానీ మనిక 3-11, 8-11, 15-13, 7-11తో నాలుగో ర్యాంక్ వాంగ్ మన్యూ చేతిలో 3-11, 6-11, 13-11, 9-11తో సున్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో 2-2తో సమమై నిర్ణాయతక మ్యాచ్‌కు దారి తీయగా.. ఐహిక 9-11, 11-13, 6-11తో మన్యు చేతిలో ఓటమిపాలైంది. దాంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Saturday, February 17, 2024, 10:31 [IST]
Other articles published on Feb 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+