
లాస్ ఏంజెలిస్: అమెరికా స్ప్రింట్ లెజెండ్ ట్రిపుల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ బాబీ జో మోరో శనివారం మరణించారు. ఆయన వయసు 84 ఏళ్లు. సాన్ బెనిటో(టెక్సాస్)లోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచాడు. రన్నింగ్ ట్రాక్‌పై చిరుతలా దూసుకెళ్లే మోరో.. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 100, 200, 4*100 మీటర్లలో గోల్డ్ మెడల్స్ సాధించి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. తద్వారా సింగిల్ ఒలింపిక్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన జెస్సీ ఒవెన్ సరసన నిలిచాడు.
తర్వాతి కాలంలో కార్ల్ లూయిస్(అమెరికా), ఉసేన్ బోల్డ్(జమైకా) కూడా ఈ ఫీట్‌ను సాధించారు. 1956లో బేస్ బాల్ హీరో మికీ మాంట్లీ, బాక్సర్ ఫ్లాయిడ్ ప్యాటర్‌సన్‌ను వెనక్కి నెడుతూ.. 'స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్'అవార్డును మోరో సొంతం చేసుకున్నాడు. 1958లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన మోరో.. 1960లో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చినా యూ ఎస్ ఒలింపిక్ టీమ్‌కు క్వాలిఫై కాలేకపోయాడు.