న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటగాళ్లు దేశ ఆస్తులు.. త్వరలోనే ట్రైనింగ్ క్యాంప్స్: కిరణ్ రిజిజు

Sports Minister Kiren Rijiju Says National Camps Will Go Ahead

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో క్రీడల పున:ప్రారంభంపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆయా రాష్ట్రాల లాక్‌డౌన్స్‌తో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రైనింగ్ క్యాంప్‌ల నిర్వహణపై సమాలోచనలు చేస్తున్నామన్నారు.

'శిక్షణా శిబిరాల ఆలస్యం కారణంగా అథ్లెట్లకు ప్రతీకూల పరిస్థితులు ఏర్పడనివ్వం. అతి త్వరలోనే ట్రైనింగ్ క్యాంప్స్ ప్రారంభిస్తాం. అయితే ఆయా రాష్ట్రాల లాక్‌డౌన్‌తో శిక్షణ శిబిరాల నిర్వాహణ మాకు సవాల్‌గా మారింది. బెంగళూరులో ఆటగాళ్లు పాల్గొనలేని పరిస్థితి ఉంది. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం'అని కిరణ్ రిజిజు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఎలాంటి రిస్క్ లేని స్టాండార్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్(ఎస్ఓపీ) పద్దతిలో జాతీయ శిక్షణా శిబిరాలను నిర్వహించాలనుకుంటున్నట్లు రిజిజు తెలిపారు. 'ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా దశలవారీగా ట్రైనింగ్ క్యాంప్‌లు నిర్వహిస్తాం. ఇప్పటికే బాక్సర్లు పటియాలలో ఉన్నారు. వారి క్వారంటైన్ సమయాన్ని పొడిగించడంతో ట్రైనింగ్ ప్రారంభించలేకపోయారు. క్వారంటైన్ టైమ్ ముగియగానే శిక్షణను ప్రారంభిస్తారు. ఇక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్లందరీ ట్రైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మిగతవారి శిక్షణ శిబిరాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒలింపిక్స్ అథ్లెట్ల శిక్షణకు మార్గం సుగుమం చేయడమే మా ప్రాధాన్యత.'అని రిజిజు స్పష్టం చేశారు.

ఇక కోవిడ్-19 కేసులు పెరగడం, పాటియాలలో బాక్సర్లు ప్రోటోకాల్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఎస్‌ఓపీ నియమ నిబంధనలు సమీక్షించాల్సిన అవసం ఉందా? అని ప్రశ్నించగా.. శిబిరాల్లోని పరిస్థితిని తెలుసుకోవడానికి తాను ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడానని రిజిజు తెలిపారు.

'పాటియాలా, బెంగళూరు‌లో ఉన్న అథ్లెట్ల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేను అక్కడే ఉంటున్న హాకీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌లతో వ్యక్తిగతంగా మాట్లాడాను. పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించడానికి శాయ్(స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా) తీసుకుంటన్న చర్యలతో వారు సంతోషంగా ఉన్నారు. క్వారంటైన్‌లో ఉన్న ఒకరు నిబంధనలు ఉల్లంఘించారని మాపై నిందలు మోపకూడదు. అలాగే ఎస్‌ఓపీ లోపమని కూడా అనవద్దు. అథ్లెట్లంతా భారత ఆస్తులు. దేశానికి రోల్ మోడల్స్. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సాయ్ చేస్తుంది.'అని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

నా తప్పిదాలతోనే అత్యంత వివాదాస్పదమైన టెస్ట్‌లో భారత్ ఓడింది: దిగ్గజ అంపైర్నా తప్పిదాలతోనే అత్యంత వివాదాస్పదమైన టెస్ట్‌లో భారత్ ఓడింది: దిగ్గజ అంపైర్

Story first published: Monday, July 20, 2020, 14:16 [IST]
Other articles published on Jul 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X