
సారీ బ్రదర్ అన్నాడు..
'తర్వాతి రోజు వెయిట్(బౌట్‌కు ముందు బరువు కొలుచుకోవడం) కోసం వెళ్లినప్పుడు.. నాకంటే ముందే సనయెవ్ అక్కడ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పటికే జరిగిన విషయం నేను మర్చిపోయా. కాబట్టి నేను కూడా విష్ చేశా. ఆ తర్వాత తను నన్ను హగ్ చేసుకొని.. సారీ బ్రదర్ అన్నాడు. చిరునవ్వుతో నేను కూడా అతడిని హగ్ చేసుకున్నా. మేమిద్దం ఫ్రెండ్సే. ఆ తర్వాత ఇతర విషయాలపై సరదాగా మాట్లాడుకున్నాం'అని దహియా చెప్పుకొచ్చాడు.

గోల్డే నా టార్గెట్..
ఇక, టోక్యో సిల్వర్ మెడల్ నెగ్గినందుకు సంతోషంగా ఉన్నానని రవి చెప్పాడు. కానీ, తాను గోల్డ్ తేవాలని అనుకున్నానని తెలిపాడు. వచ్చే పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా నెగ్గుతానని దహియా విశ్వాసం వ్యక్తం చేశాడు. 'సిల్వర్ మెడల్ గెలిచినందుకు సంతోషంగానే ఉంది. కానీ నాకు బంగారు పతకం తేవాలని ఉండే. మా రెజ్లర్లు గతంలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. కానీ గోల్డ్ సాధించలేదు. అందుకే నేను అది తేవాలనుకున్నా. అందుకే సిల్వర్ గెలిచినా బాధపడ్డా. కానీ పారిస్ ఒలింపిక్స్‌లో ఆ కలను నేరువేర్చుకుందామని నా మనసుకు చెప్పుకున్నా. పారిస్‌లో స్వర్ణం సాధిస్తానని మీ అందరికి మాట ఇస్తున్నాను. నా వయసు కేవలం 23 ఏళ్లే. నాకు చాలా కెరీర్ ఉంది. ఇంటికెళ్లాకే వారితో కొన్నాళ్లు సరదాగా గడుపుతా. ఆ తర్వాత మళ్లీ నా ప్రాక్టీస్ మొదలు పెడతా. పారిస్‌లో స్వర్ణం సాధించడమే నా లక్ష్యం'అని రవి చెప్పుకొచ్చాడు.

బలమైన ప్రత్యర్థి..
ఫైనల్లో తనతో తలపడ్డ రష్యన్ ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) రెజ్లర్ జవుర్ ఉగేవ్ తనకంటే బలమైన వాడని రవి దహియా అంగీకరించాడు. అతనికి ఎంతో అనుభవం ఉందన్నాడు. 'జవుర్ నా కంటే మెరుగైన వాడు. ఆ విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఓటమిని అంగీకరించడం మంచిదే. అతను చాలా అనుభవం కలిగిన రెజ్లర్. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ రెండు సార్లు గెలిచాడు. అందుకే మ్యాట్‌పై నా కంటే ఎంతో మెరుగ్గా రాణించాడు. నా తల్లిదండ్రులతో మాట్లాడి రెండు నెలలు అవుతుంది. సిల్వర్ మెడల్ గెలిచిన వెంటనే వారికి ఫోన్ చేశా. వారంత భాగోద్వేనికి గురవ్వడంతో పాటు సంతోషం వ్యక్తం చేశారు. నా రాక కోసం ఎదురు చూస్తున్నారు. నాకు సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.

కొన్ని వదులుకుంటేనే?
ఏదైనా సాధించాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. నా వరకు అయితే కుటుంబానికి, సన్నిహితులకు దూరంగా ఉండటం సహకరించింది. నా ఆటపై దృష్టిపెట్టేలా చేసింది. రొటిన్ ప్రాక్టీస్‌తో పాటు రెజ్లింగ్ వీడియోలను అర్థం చేసుకోవడం, డైట్‌పై దృష్టిసారించడం సులువైంది. ఈ రోజు నేను ఈ స్థాయలో ఉన్నానంటే దానికి మా తల్లిదండ్రులే కారణం. మా నాన్న ఓ రైతు. నా కోసం ఆయనకు సాధ్యమైనంత వరకు చేశాడు. ఇక వాళ్లు విశ్రాంతి తీసుకొని మిగతా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా. ఆ విషయంలో వారిదే తుది నిర్ణయం'అని రవి దహియా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












