
ఓటమి ఖాయమైన వేళ..
బౌట్ ఫస్ట్ 30 సెకన్లలో రవికి పట్టు దొరక్కపోవడంతో 0-1తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకుని నురిస్లామ్‌ను మ్యాట్‌మీద పడేసి రెండు పాయింట్లు నెగ్గాడు. ఫలితంగా 2-1 లీడ్‌తో ఫస్ట్ పీరియడ్ ముగించాడు. అయితే టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ అయిన నురిస్లామ్ రవిపై అటాకింగ్ దిగాడు. మంచి గ్రిప్‌తో రవిని మూడుసార్లు ఫిట్లే(ప్రత్యర్థి కాళ్లను మెలిపెట్టడం)కు గురిచేసి వరుసగా 8 పాయింట్లు సాధించాడు. దాంతో లీడ్ 9-2కు చేరింది. దాదాపుగా ఓటమి ఖాయమే అనుకున్న టైమ్‌లో రవిసంచలనం చేశాడు.

పిన్ డౌన్ చేసి..
తనకు మాత్రమే సాధ్యమైన సూపర్ స్టామినా, టెక్నికల్ పవర్స్‌కు తోడు అద్భుతమైన మెంటల్ స్ట్రెంత్ చూపెట్టి చివరి నిమిషంలో అద్భుతం చేస్తూ తనదైన శైలిలో బౌట్‌ను ముగించాడు. కౌంటర్ అటాక్‌తో 7-9కు తగ్గించాడు.కౌంటర్ అటాక్‌తో రెండు నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 7-9కు తగ్గించాడు. చివరిలో నురిస్లామ్ రెండు కాళ్లను బలంగా అదిమి పట్టి పిన్ డౌన్ (కొన్ని సెకన్ల పాటు మ్యాట్‌పై ప్రత్యర్థిని కదలకుండా చేయడమే పిన్ డౌన్) చేసి చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
కసితీరా కొరికినా..
అయితే ఇలా పిన్ డౌన్ చేసే సమయంలో నురిస్లామ్ సనయెవ్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. రవి తన మెడని చుట్టేయడంతో తప్పించుకునేందుకు అతని చేతి కండని నురిస్లామ్ గట్టిగా కొరికేశాడు. అయినప్పటికీ.. బాధని భరించిన రవి కుమార్ నురిస్లామ్ సనయేవ్ వీపుని నేలకి ఆనించే వరకూ పట్టు వీడలేదు. బౌట్ ముగిసిన అనంతరం ప్రత్యర్థి పంటి గాట్లను రిఫరీకి చూపించాడు. నురిస్లామ్ సనయేవ్ తీరుని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇంత దారుణమా?
కజకిస్థాన్ ప్లేయర్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యహరించాడని సెహ్వాగ్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. 'ఇది మరీ దారుణం. కసితీరా కొరికినా రవి దహియా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. కజకిస్థాన్ ప్లేయర్ ప్రవర్తించిన తీరు బాలేదు.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. పంటి గాయాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. ఇక రవికి గాయం కాలేదని, పంటిగాట్లు పడ్డ చోట ఐస్ ప్యాక్ పెట్టగా అతని నొప్పి తగ్గిపోయిందని భారత్ సపోర్ట్ స్టాఫ్ మెంబర్లు చెప్పారు. ఫైనల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక క ఫైనల్లో రష్యాకి చెందిన యుగేవ్ జావుర్‌ని రవి కుమార్ దహియా ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకి ఢీకొననున్నాడు.


Click it and Unblock the Notifications
