Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అర్ధరాత్రి కూడా లేస్తా.. రోజుకు 2.7 కిలోల చికెన్‌ తింటా'

Ronnie Coleman reveals he ate 2.7 kg chicken per day and had 0.3% body fat

అమెరికా: రోనీ కోల్‌మన్.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ బాడీ బిల్డింగ్‌లో ఓ దిగ్గజం. అమెరికాకు చెందిన రోనీ.. 135 కిలోల బరువు ఉంటాడు. అతడి శరీర సౌష్టవాన్ని చూసి అభిమానులు అందరూ 'హల్క్‌' అని ముద్దుగా‌ పిలుచుకుంటారు. రికార్డు స్థాయిలో ఎనిమిదిసార్లు మిస్టర్‌ ఒలింపియా టైటిల్‌ను రోనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రీడల 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌'లోనూ రోనీకి చోటుదక్కింది.

షాకింగ్‌ విషయాలు:

షాకింగ్‌ విషయాలు:

కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో అందరిలానే రోనీ కోల్‌మన్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో రోనీ.. ప్రముఖ యూఎఫ్‌సీ (అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌) కామెంటేటర్‌, కమెడియన్‌ జొ రోగన్‌ నిర్వహించే షో 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో పాల్గొన్నాడు. 90 నిమిషాల జరిగిన ఈ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో రోనీ తన కెరీర్, ఫిట్‌నెస్‌, శిక్షణ, తీసుకునే పౌష్టికాహారం, శరీరంలోని కొవ్వు శాతం లాంటి పలు విషయాలను చర్చించాడు. 56 ఏళ్ల రోనీ చెప్పిన షాకింగ్‌ విషయాలు విన్న చాలా మంది ఫాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకు రోనీ ఏం చెప్పాడంటే?!!

రోజుకు 2.7 కిలోల చికెన్:

రోజుకు 2.7 కిలోల చికెన్:

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో రోనీ కోల్‌మన్ మాట్లాడుతూ... 'కచ్చితంగా ఏడాదికి 2 నుంచి 4.5 కిలోల బరువు పెరుగుతాను. కండలు రావడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తాను. భోజనం విషయంలో చాలా కఠిన నియమాలు ఉంటాయి. 450 గ్రాముల గ్రిల్‌ చికెన్‌, ఓ కప్పు అన్నం.. ఇలా రోజుకు ఆరు సార్లు తింటాను. అంటే రోజుకు 2.7 కిలోల చికెన్‌. ఇలా తింటే మూడు గంటలకోసారి ఆకలి వేస్తుంది. అర్ధరాత్రి కూడా లేచి తింటాను. అయితే కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను మాత్రం ఎక్కువగా తీసుకోను' అని తెలిపాడు.

నా బాడీ ఫ్యాట్‌ 0.33 శాతం:

నా బాడీ ఫ్యాట్‌ 0.33 శాతం:

'రోజుకు 2.7 కిలోల చికెన్ కదా.. బాడీలో ఎంతో ఫ్యాట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ మీకు ఓ నమ్మశక్యం కాని నిజం చెప్పానా?!!. నా బాడీ ఫ్యాట్‌ కేవలం 0.33 శాతం మాత్రమే. ఉచితంగా జిమ్‌ సభ్యత్వం కోసమే బాడీ బిల్డింగ్‌ను ఆరంభించా' అని రోనీ కోల్‌మన్ చెప్పుకొచ్చాడు. 1995 నుంచి 2005 వరకు వరుసగా ఎనిమిదిసార్లు మిస్టర్‌ ఒలింపియన్‌గా నిలిచిన కోల్‌మన్‌కు 2006లో బ్రేక్‌ పడింది.

ఇంగ్లండ్ పర్యటనకు ఇద్దరు పాక్ క్రికెటర్లు దూరం.. కారణం ఇదే!!

Story first published: Friday, June 12, 2020, 12:15 [IST]
Other articles published on Jun 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+