Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకప్పుడు రూ.150 కి గిన్నెలు తోమాడు.. ఇప్పుడు భారత్‌కు రజత పతకం అందించాడు!

11 ఏళ్ల పసితనంలో రోజుకు రూ.150 కూలితో గిన్నెలు కడిగిన ఆ బాలుడు.. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. సంకల్పం ఉంటే కడు పేదరికాన్ని కూడా జయించొచ్చని నిరూపించాడు ఆ కుర్రాడు.! విధిరాతతో పోరాడి విశ్వవేదిక‌పై భారత్‌కు సిల్వర్ మెడల్ అందించాడు. అతనెవరో కాదు 28 ఏళ్ల మణిపూర్ మణిపూస, భారత వెయిట్ లిఫ్టర్ రిషికాంత్ సింగ్.!

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తొలి పురుష మణిపూర్ వెయిట్ లిఫ్టర్‌గా రిషికాంత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో 60 కేజీల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 264 కేజీల బరువెత్తి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. ఈ విజయంతో ఒక్కసారిగా తన కష్టాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. రిషికాంత్ సింగ్ జీవిత ప్రయాణం తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు. కష్టాలను ఎదురొడ్డి అంతర్జాతీయ వేదిక వరకు సాగిన అతని ప్రయాణం ప్రతీ ఒక్కరి స్ఫూర్తి దాయకం.

Rishikanta Singh Incredible Journey Froma Struggling for Rs 150 to Standing on the CWG Podium

11 ఏళ్ల వయసులో ధాబాలో పని..

11 ఏళ్ల వయసులోనే కుటుంబ పోషణలో భాగమైన రిషికాంత్ సింగ్.. మణిపూర్‌లోని ఇంఫాల్ జిల్లా, నైహక్తాంగ్ మఖా మానింగ్ లేకై గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ధాబాలో రోజుకు రూ.150 కూలికి పనిచేశాడు. దాబాలో గిన్నెలు తోమడం, నీళ్ల బకెట్లు మోయడం వంటి పనులు చేయడంతో పాటు నిర్మాణ స్థలాల్లో కూలి పనులు చేస్తూ పెరిగాడు.

కామన్వెల్త్ గేమ్స్ విజయానంతరం తన జీవిత ప్రయాణాన్ని నెమరవేసుకుంటూ రిషికాంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు.'నా చిన్న వయసులో ఎన్నో పనులు చేశాను. ధాబాలో గిన్నెలు కడగడం, నీళ్లు మోయడం వంటి పనులతో పాటు తాపి మేస్త్రీ కూలిగా డబ్బులు సంపాదించాను. మా నాన్న టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన సంపాదన మా కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోయేది కాదు.

నాలాంటి వారికి ఈ పతకం అంకితం..

మా కుటుం పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే.. మేం ఒకే పూట మాత్రమే భోజనం చేసేవాళ్లం. మా అమ్మ కూరగాయాలు లేకుండా అన్నం, గోధుమ పిండి ముద్దలను తినిపించేది. నా కుటుంబం కోసం నేను రోజుకు రూ. 150 కూలికి పనిచేశాను. ఈ రోజు నా జేబులో సిల్వర్ మెడల్ పెట్టుకొని భోజనం చేస్తూ.. వంటి సిబ్బంది పనిచేయడాన్ని చూస్తేంటే.. నా బాల్యం గుర్తొచ్చింది. నాలా కుటుంబ భారాన్నీ మోసే అందరికి ఈ పతకం అంకితమిస్తున్నా'అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ రిషికాంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు.

మణిపూర్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రస్తుత సెక్రటరీ, అప్పటి కోచ్ ఎస్ బోజేంద్ర సింగ్ ప్రోత్సాహంతో రిషికాంత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్ వైపు వచ్చాడు. 12 ఏళ్ల వయసులో ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడే రిషికాంత్‌.. ఖుమాన్ లంపాక్ స్టేడియంలో ఎస్‌ఏఐ అకాడమీలో ట్రయల్స్‌కు హాజరయ్యాడు. అయితే అతన్ని బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌కు రెండింటికి అతన్ని షార్ట్ లిస్ట్ చేశారు. అయితే బోజేంద్ర సింగ్ అతన్ని వెయిట్ లిఫ్టింగ్‌లోకి తీసుకున్నారు.

తిండి కోసం ట్రైనింగ్..

'రిషికాంత్ ట్రయల్స్‌కు వచ్చినప్పుడు చాలా సన్నగా ఉండేవాడు. కానీ అతని కండరాలు చాలా బలంగా కనిపించాయి. అతని కళ్లలో సంకల్ప బలం కూడా నన్న ఆకట్టుకుంది. అతను చాలా సహజంగా వెయిట్‌లిఫ్టింగ్ చేశాడు.'అని కోచ్ బోజేంద్ర సింగ్ గుర్తుచేసుకున్నారు. కడుపు నిండా భోజనం కోసమే తాను స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ తీసుకున్నానని రిషికాంత్ చెప్పుకొచ్చాడు.

18 ఏళ్ల వయసులో తన కుటుంబ పరిస్థితి మరింత దిగజారడంతో వెయిట్ లిఫ్టింగ్‌కు రిషికాంత్ ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. అయితే ఇంపాల్‌లోని వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో చేరడంతో రిషికాంత్ కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కింది.

Story first published: Tuesday, July 28, 2026, 11:25 [IST]
Other articles published on Jul 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+