Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రాడ్ పిట్ ఎఫ్-1 సినిమా.. రూ. 2571 కోట్లు వసూలు!

ఇటీవల క్రీడలకు సంబంధించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కార్ రేసింగ్ ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ఎఫ్‌-1 సూపర్ హిట్టైంది. కార్ రేసింగ్ పట్ల ఆసక్తిరేకెత్తించేలా ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 2571 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఫార్మూలా 1 రేసింగ్ గొప్పతనంతో పాటు ఈ ఆట నైపుణ్యాలను సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చేసింది.

జోసెఫ్ కోసిన్స్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 7 నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ డాలర్ల(రూ.2.571 కోట్లు)ను వసూలు చేసింది. ఉత్తర అమెరికాలోనే 112 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 960 కోట్లు) వసూలు చేసింది. ఈ సినిమాలో బ్రాడ్ హిట్ హీరోగా నటించాడు. అతని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఏడు సార్లు ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు.

ఈ సినిమాలో బ్రాడ్ పిట్ సోనీ హేస్ ఫార్ములా 1 డ్రైవర్‌గా నటించాడు. 1990లో జరిగిన ఓ భయంకరమైన ప్రమాదం తర్వాత అతను రేసింగ్‌కు దూరమవుతాడు. ఓ ఏడాది తర్వాత ఓ (APXGP)జట్టు యజమాని అతన్ని ప్రోత్సహించి తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తాడు. యువ ప్రతిభావంతమైన రేసర్ రూకీ డ్రైవర్ జోషువా పియర్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తాడు. మెంటార్‌గా బ్రాడ్‌ పిట్ ఏం చేశాడు?, APXGP టీమ్‌ను ఛాంపియన్‌గా ఎలా బెట్టాడనేదే సినిమా కథ. ఆసాంతం ఆసక్తికరంగా ఉన్న ఈ సినిమా.. ఎఫ్-1 రేసు గురించి ప్రేక్షకుడికి తెలిసేలా చేసింది. ఎఫ్-1 రేస్‌పై ఆసక్తిని పెంచేలా ఈ సినిమా ఉంది. నటీ నటుల అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

Real F1 Legends on the Silver Screen Current and Former Formula 1 Drivers Who Appear in Brad Pitt s F1 Movie

ఈ సినిమాను రియల్ ఎఫ్1 రేస్ వీకెండ్‌లో.. సిల్వర్‌స్టోన్ వంటి సర్క్యూట్స్‌లో తెరకెక్కించారు. బ్రాడ్ పిట్, డామ్సన్ ఇడ్రిస్ రియల్‌గా మెర్సిడెస్ ఫార్ములా 2 కార్లను నడిపారు. లూయిస్ హామిల్టన్, టోటో వోల్ఫ్, మాక్స్ వెర్స్టాపెన్ వంటి రియల్ F1 స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారు.

ఎఫ్-1లో నటించిన నటులు..

బ్రాడ్ పిట్ - సోనీ హేస్

డామ్సన్ ఇడ్రిస్ - జోషువా పియర్స్

జావియర్ బార్డెమ్ - రూబెన్ (APXGP టీమ్ యజమాని)

కెర్రీ కొండన్ - కేట్ మెక్‌కెన్నా (APXGP టెక్నికల్ డైరెక్టర్)

టోబియాస్ మెంజీస్ - పీటర్ బన్నింగ్

హిట్టా? ఫ్లాపా?

ఈ చిత్రాన్ని 250 మిలియన్ల డాలర్లతో తెరకెక్కించినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. బడ్జెట్, మార్కెటింగ్ ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే ఈ సినిమా పెట్టుబడి తిరిగి రావడానికి సుమారు 600 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న వసూళ్లను బట్టి చూస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలే. కానీ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతున్నందున కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సూపర్ మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్, ఫస్ట్ స్టెప్స్ వంటి పెద్ద చిత్రాలు ఈ నెలలో విడుదల కానుండటంతో ఎఫ్-1 కలెక్షన్లపై ప్రభావం పడనుంది.

Story first published: Thursday, July 10, 2025, 22:33 [IST]
Other articles published on Jul 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+