Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘రిమోట్ కంట్రోల్’లో పాక్ జట్టు: పీసీబీపై మాజీ కెప్టెన్ ఫైర్!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ కష్టాలు మైదానం బయట కూడా తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందరినీ ఆశ్చర్యపరిచేలా జట్టులో మార్పులు చేసింది. సిరీస్ మధ్యలోనే బోర్డు ఏడుగురు ఆటగాళ్లను, ఇద్దరు కోచ్‌లను పాకిస్థాన్‌కు తిరిగి పంపింది.ఈ నిర్ణయం తరువాత పాకిస్తాన్ క్రికెట్‌లో జట్టు యాజమాన్యానికి, పీసీబీకి మధ్య హక్కుల విషయంలో మరోసారి చర్చ రాజుకుంది. ఇప్పుడు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ నేరుగా బోర్డుపై విమర్శలు గుప్పించారు.

భారత్–జపాన్ మధ్య చారిత్రాత్మక పోరు.. మ్యాచ్ ఎప్పుడంటే?

భారత్–జపాన్ మధ్య చారిత్రాత్మక పోరు.. మ్యాచ్ ఎప్పుడంటే?

పీసీబీపై రషీద్ లతీఫ్ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును రిమోట్ కంట్రోల్ తో నడుపుతోందని రషీద్ లతీఫ్ ఆరోపించారు. "జట్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవలసింది బోర్డే అయితే.. కోచ్‌లను ఇంగ్లాండ్‌కు పంపడంలో అర్థం ఏమిటి?" అని ప్రశ్నిస్తూ రషీద్ లతీఫ్ పీసీబీ పనితీరును ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రస్తుత పాకిస్తాన్ జట్టు కూర్పుతో పాటు మాజీ కోచ్‌ల చుట్టూ ఉన్న వివాదాలను కూడా ప్రస్తావించారు.జట్టును రిమోట్ కంట్రోల్‌తో నడపాలనుకుంటే.. సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్‌లను ఇంగ్లాండ్‌కు ఎందుకు పంపారని రషీద్ లతీఫ్ ప్రశ్నించారు. అలాగే గ్యారీ కిర్‌స్టన్, జాసన్ గిల్లెస్పీల వంటి దిగ్గజ కోచ్‌ల సెలెక్షన్ అధికారాలను ఎందుకు తొలగించారని కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కెప్టెన్ బాబర్ ఆజంను ఇరికించారని ఆయన బాంబు పేల్చారు.

Rashid Latif Attacks Pakistan Cricket Board Says Pakistan Team Being Run via Remote Control

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఓటమి తర్వాత, పీసీబీ సాధారణ మార్పులు చేయకుండా, మొత్తం జట్టు నిర్మాణాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. సీనియర్ వికెట్ కీపర్-బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో సహా ఏడుగురు ఆటగాళ్లను
పాకిస్థాన్‌కు తిరిగి పంపాలని బోర్డు నిర్ణయించింది.కోచింగ్ సిబ్బందిలో కూడా భారీ మార్పులు జరిగాయి. టెస్ట్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తొలగించగా.. బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను కూడా వెనక్కి పంపారు. దీని తర్వాత, బర్మింగ్‌హామ్‌లో జరగనున్న మూడో, చివరి టెస్ట్ కోసం వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్‌కు జట్టు బాధ్యతలు అప్పగించారు.

బాబర్ ఆజామ్ చెత్త రికార్డ్.. బౌలర్లతో పోటీపడుతున్న పాకిస్థాన్ కింగ్!

Also Read

బాబర్ ఆజామ్ చెత్త రికార్డ్.. బౌలర్లతో పోటీపడుతున్న పాకిస్థాన్ కింగ్!

టెస్ట్ సిరీస్ అప్పటికే 0-2తో సిరీస్ చేజారిన సమయంలో పీసీబీ తీసుకున్న ఈ హడావిడి నిర్ణయాలు జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కోచ్‌లకు, కెప్టెన్‌కు నిర్ణయాధికారం ఇవ్వకుండా బోర్డే జోక్యం చేసుకోవడం వల్ల గతంలో గిల్లెస్పీ, కిర్‌స్టన్ కూడా తమ పదవులను వదులుకున్నారని రషీద్ లతీఫ్ గుర్తు చేశారు. పాకిస్థాన్ క్రికెట్లో చాలా కాలంగా నడుస్తున్న అధికార పరిమితుల వివాదానికి పీసీబీ తీరు అద్ధం పడుతోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Saturday, September 5, 2026, 17:31 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+