Tokyo 2020: సెమీస్‌లో సింధుకు అగ్ని పరీక్ష.. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్‌తో ఢీ! కలవరపెడుతున్న రికార్డ్స్!

టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ 2020లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జోరు కొనసాగోతుంది. వరుసగా నాలుగో విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో ఒలింపిక్ మెడల్‌కు అడుగుదూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 21-13, 22-20తో నాలుగో సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించింది. అయితే సెమీఫైనల్లో తెలుగు తేజం బలమైన ప్రతర్థి వరల్డ్ నెంబర్ 1, తై జూ యింగ్(చైనీస్ తైపీ)తో తలపడనుంది. ఈ ఒక్క అడ్డంకిని ధాటితే సింధు మెడల్ ఖాయం అవుతోంది.
అయితే తై జూ యింగ్‌తో సింధు ముఖా ముఖి పోరే ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది. తై జూ యింగ్‌తో సింధు మొత్తం 18 సార్లు తలపడగా కేవలం ఐదుసార్లు మాత్రమే గెలిచింది. ఇక చైనీస్ తైపీ ప్లేయర్ ఏకంగా 13 సార్లు పై చేయి సాధించింది. అంతేకాకుండా బ్యాడ్మింటన్ ప్రపంచంలో తై జూ నెంబర్ వన్ ప్లేయర్‌గా కొనసాగుతుంది. అత్యధిక రోజులు ఈ ఘనతను అందుకున్న ప్లేయర్‌గా నిలిచింది.
ఇక సింధు X తై జూ యింగ్ సెమీస్ పోరు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. సోనీలీవ్‌తో పాటు సోటీ టెన్ 1,3, 4 చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియో టీవీ యాప్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు. అయితే సింధు తాజా ఫామ్ చూస్తుంటే తై జూ యింగ్ పై పై చేయి సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. యమగూచిపైనే సింధు అద్వీతియమైన ప్రదర్శన కనబర్చింది. తొలి గేమ్ అలవోకగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం శ్రమించాల్సి వచ్చింది.
యమగూచి ధీటుగా బదులివ్వడంతో పోరు హోరాహోరిగా సాగింది. 16-16, 17-17తో ఉత్కంఠతను తలపించింది. చివరకు వరుసగా పాయింట్లు సాధించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్ ఫినిష్ చేసింది. అదే జోరును కొనసాగించి తై జూ యింగ్‌ను మట్టి కరిపిస్తే సింధుకు గోల్డ్ మెడల్ దక్కడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications