Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

12 ఏళ్ల పిల్లాడి చేతిలో ఓడిన వరల్డ్ ఛాంపియన్!

వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌-2025 టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. 12 ఏళ్ల పిల్లాడి చేతిలో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. రష్యాకు చెందిన టీనేజ్ సెన్సేషన్ సెర్గీ స్లోకిన్ చేతిలో గుకేశ్ ఖంగుతిన్నాడు. ఈ ఫలితం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఉత్కంఠగా సాగిన మూడో రౌండ్‌లో గుకేశ్ చేసిన ఒకే ఒక్క తప్పిదం అతని ఓటమిని శాసించింది.

ఈ రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్‌.. గేమ్ 70వ ఎత్తు వద్ద తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఎత్తు వద్ద అతనికి 8 సెకన్ల సమయం మాత్రమే దక్కగా.. ప్రత్యర్థి స్లోకిన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో ఏనుగుల మార్పిడిని ఆఫర్ చేశాడు. డ్రాకు అంగీకరించని గుకేశ్ గెలవాలనే లక్ష్యంతో ప్రత్యర్థి ఆఫర్‌ను తిరస్కరించాడు. తన రూట్‌ను F4కి జరిపాడు. ఈ నిర్ణయం గుకేశ్ కొంపముంచింది. ఆ తర్వాతి కొద్ది ఎత్తుల్లోనే గుకేశ్‌ తన బిషప్‌ను, చివరి పాన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో మరో పది ఎత్తుల్లోనే గుకేశ్‌ తన ఓటమిని అంగీకరించాడు.

Pressure Gets to Gukesh as He Loses Blitz Game to 12-Year-Old Chess Prodigy

ఈ గేమ్ గురించి ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ మారిస్ యాష్లే మాట్లాడుతూ.. 12 ఏళ్ల సెర్గీ స్లోకిన్‌ను కొనియాడాడు. గుకేశ్ అనవసర తప్పిదంతో మూల్యం చెల్లించుకున్నాడని, డ్రాకు అంగీకరించాల్సిందని అభిప్రాయపడ్డాడు. గుకేశ్ అత్యుత్సాహమే అతని కొంపముంచిందని చెప్పాడు. అనవసర రిస్క్‌తో డ్రా అయ్యే గేమ్‌లో ఓటమిపాలయ్యాడని తెలిపాడు. ఒక వరల్డ్ ఛాంపియన్ నుంచి ఇలాంటి నిర్ణయం ఊహించలేదన్నాడు. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్‌కు ఈ ఓటమి మాయని మచ్చగా మిగిలిపోయింది.

Story first published: Tuesday, December 30, 2025, 15:13 [IST]
Other articles published on Dec 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+