భారత్‌కు బిగ్ షాక్.. ఆ గోల్డ్ మెడలిస్ట్‌పై వేటు!
పారిస్ పారా ఒలింపిక్స్ 2024కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. టోక్యో పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అతనిపై 18 నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీఎమ్‌డబ్ల్యూఎఫ్) ప్రకటించింది.
డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఈ సస్పెన్షన్‌తో ప్రమోద్ భగత్.. పారిస్ పారాలింపిక్స్ 2024కు దూరంకానున్నాడు. 'ప్రమోద్ భగత్‌ను 12 నెలల వ్యవధిలో మూడు సార్లు డోపింగ్ పరీక్షరే హాజరు కావాలని కోరాం. అయినా అతను రాలేదు. అంతేకాకుండా తన గైర్హాజరీకి గల కారణాలను వెల్లడించలేదు. నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్(సీఏఎస్) డోపింగ్ నిరోధక విభాగం మార్చి 1, 2024న అతడిని సస్పెండ్ చేసింది.

తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రమోద్ సీఏఎస్‌ను కోరాడు. దీనిని 29 జూలై 2024 సీఏఎస్ కొట్టేసింది. మార్చి1న డోపింగ్ నిరోధక విభాగం ఇచ్చిన తీర్పును సమర్థించింది.'అని బీడబ్ల్యూఎఫ్ తమ ప్రకటనలో పేర్కొంది. టోక్యో పారా ఒలింపిక్స్‌లో ప్రమోద్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్3 కేటగిరీలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో డేనియల్ బెథెల్(బ్రిటన్)ను ఓడించాడు.
ఈసారి కూడా అతను పతకం తెస్తారని అంతా అనుకున్నారు. కానీ నిషేధం పడటంతో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. పారిస్ పారాలింపిక్స్ ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications